పెద్దమ్మతల్లి టెంపుల్‌ని సందర్శించిన పూజా.. ట్రెడిషనల్‌ లుక్‌లో హల్‌చల్‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

Published : Jan 08, 2023, 04:51 PM ISTUpdated : Jan 08, 2023, 07:07 PM IST

పూజా హెగ్డే ట్రెడిషన్‌ లుక్‌లోకి మారిపోయింది. ఎప్పుడూ పొట్టి దుస్తుల్లో అందాలు చూపిస్తూ టెంపరేచర్ పెంచే ఈ అందాల భామ ఇప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతుంది. నయా లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
16
పెద్దమ్మతల్లి టెంపుల్‌ని సందర్శించిన పూజా.. ట్రెడిషనల్‌ లుక్‌లో హల్‌చల్‌.. ఎంత క్యూట్‌గా ఉందో!

డస్కీ బ్యూటీ పూజా హెగ్డే ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించింది. అమ్మవారిని దర్శించుకుంది. కాసేపు అమ్మవారి సన్నిధిలో హల్‌చల్‌ చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం పూజాకి సంబంధించిన ఈ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

26

ఇందులో వైట్‌ కలర్‌ కుర్తాలో మెరిసింది పూజా హెగ్డే. క్యూట్‌ లుక్‌లో ఆకట్టుకుంటుంది. సాంప్రదాయ దుస్తుల్లో పూజా అందం మరింత పెరిగిపోవడం విశేషం. ట్రెండీ వేర్‌లో హాట్‌గా కనిపించే ఈ బ్యూటీ ఇలా ట్రెడిషనల్‌ వేర్‌లో ఎంతో కనువిందుగా, కుందనపు బొమ్మలా ఉంది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

36

పూజా ట్రెండీ వేర్‌లో తన ఘాటైన అందాలను ఆవిష్కరిస్తూ ఆకట్టుకుంటుంది. హాట్‌ పోజులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. కానీ ఈ బ్యూటీ ఇలా ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. బట్‌ ఆమె అందం మరింత పెరిగిందంటూ కితాబివ్వడం విశేషం.  
 

46

పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్‌బాబు సినిమాలో నటించేందుకు సిద్ధమవుతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పూజానే మెయిన్‌ హీరోయిన్‌. శ్రీలీల రెండో హీరోయిన్‌గా కనిపించబోతుంది. `మహర్షి` తర్వాత మహేష్‌తో జోడీ కట్టబోతుంది పూజా. ఈ సినిమా సంక్రాంతి అనంతరం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌ శివారులో దీనికి సంబంధించిన రెండు సెట్లు వేశారని సమాచారం. 
 

56

మరోవైపు హిందీలోనూ సల్మాన్‌తో సినిమా చేస్తుంది పూజా హెగ్డే. అక్కడ `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. వెంకటేష్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు తమిళంలోనూ ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు సమాచారం. 
 

66

పూజా హెగ్డే కి 2022 కలిసి రాలేదు. ఆమె నటించిన `ఆచార్య`, `రాధేశ్యామ్‌`, `బీస్ట్`తోపాటు `సర్కస్‌` మూవీస్‌ బోల్తా కొట్టాయి. వరుసగా నాలుగు సినిమాలు పరాజయం చెందడంతో పూజాకి పెద్ద షాకిచ్చే విషయమనే చెప్పాలి. అప్పటి వరకు గోల్డెన్‌ లెగ్‌గా, లక్కీ హీరోయిన్‌గా నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐరన్‌ లెగ్‌ ముద్రని ఫేస్‌ చేసే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేస్తున్న సినిమాలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. మహేష్‌, త్రివిక్రమ్‌లపైనే ఎన్నో ఆశలు పెట్టుకుందీ అందాల భామ. మరి ఏం జరుగుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories