Vijay Sethupathi:l బిగ్ బాస్ షోలో నటుడు విజయ్ సేతుపతి నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో, విజయ్ టీవీ దీనిపై అధికారికంగా ఒక వివరణ ఇచ్చింది.
తమిళ బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్స్ వివాదాస్పదం కావడంతో, షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ ఒక ప్రకటన విడుదల చేసింది. 'ఇది కేవలం ఒక వినోద కార్యక్రమం మాత్రమే. ఇందులో మాట్లాడే విషయాలు, పోటీల్లో ఒక భాగం. ఏ ఒక్క వ్యక్తిని, సంస్థను, లేదా సిద్ధాంతాన్ని విమర్శించడం మా ఉద్దేశం కాదు' అని విజయ్ టీవీ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో 'తమిళగ వెట్రి కళగం' మద్దతుదారులు తీవ్రంగా విమర్శించడంతో ఈ వివరణ వచ్చింది.
24
అసలేం జరిగింది?
బిగ్ బాస్ షోలో నాయకత్వం గురించి విజయ్ సేతుపతి మాట్లాడిన మాటలు, నటుడు, సీఎం విజయ్‌ను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. 'నాయకత్వం అంటే ఏంటో తెలియకుండా హామీలు ఇవ్వడం, సమస్య వచ్చినప్పుడు ఎదుటివారిని నిందించి పారిపోవడం నాయకత్వం కాదు' అని విజయ్ సేతుపతి అన్నారు. ఇది విజయ్‌పై పరోక్ష దాడి అని చాలామంది నెటిజన్లు కామెంట్ చేశారు. డీఎంకేను సంతోషపెట్టడానికే విజయ్ సేతుపతి ఇలా విజయ్‌ను టార్గెట్ చేశారని 'తమిళగ వెట్రి కళగం' పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
34
అభిమానుల మధ్య వార్
విజయ్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కూడా విజయ్ సేతుపతి శుభాకాంక్షలు చెప్పలేదని ఆయన ఫ్యాన్స్ గుర్తుచేస్తున్నారు. కానీ, విజయ్ సేతుపతి అభిమానులు మాత్రం, 'ఆయన బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన సంఘటనల ఆధారంగానే మాట్లాడారు. దీనికి అనవసరంగా రాజకీయ రంగు పులమొద్దు' అని వాదిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో మొదటి వారం కెప్టెన్‌గా ఉన్న షాధికా, తనపై వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక ఆ పదవే వద్దని తప్పుకుంది. ఆ విషయాన్ని ఉద్దేశించే సేతుపతి మాట్లాడారని, అదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసిందని అంటున్నారు.
విజయ్ సేతుపతి, విజయ్‌తో కలిసి 'మాస్టర్' సినిమాలో నటించారు. ఆ సినిమాలో విజయ్‌కు విలన్‌గా 'భవాని' అనే పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. సినిమా రిలీజ్ టైంలో పోస్టర్‌పై విజయ్ సేతుపతి పేరు లేకపోవడంతో, ఆయన పేరు కూడా చేర్చమని స్వయంగా విజయ్ పట్టుబట్టారని అంటారు. అంతేకాదు, 'మాస్టర్' షూటింగ్ స్పాట్‌లో విజయ్‌కు విజయ్ సేతుపతి తన సిగ్నేచర్ ముద్దు కూడా ఇచ్చారు.