Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్

Published : Mar 04, 2026, 10:58 PM IST

Vijay Divorce: 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, నటుడు దళపతి విజయ్ భార్య సంగీత సొర్నలింగం తీవ్రమైన ఆరోపణలతో విడాకులకు దరఖాస్తు చేశారు. అయితే విడాకుల కోసం తన భార్యకి విజయ్‌ భారీగా భరణం ఆఫర్‌ చేశాడట. 

PREV
15
విజయ్‌ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్

సౌత్ సూపర్‌స్టార్, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ తన సినిమాలతో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల తన చివరి చిత్రం 'జన నాయగన్' రిలీజ్‌తో వార్తల్లో నిలిచారు. అయితే, ఈ మధ్య ఆయన వ్యక్తిగత జీవితం కూడా హాట్ టాపిక్‌గా మారింది.

25
విడాకులకు దరఖాస్తు చేసిన విజయ్‌ భార్య

దళపతి విజయ్, ఆయన భార్య సంగీత సొర్నలింగం విడాకుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విజయ్‌కు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపిస్తూ సంగీత ఇటీవల చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

35
27 ఏళ్ల పెళ్లి బంధానికి త్వరలో ముగింపు?
27 ఏళ్ల తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని సంగీత నిర్ణయించుకోవడంతో, విజయ్ కోర్టు బయటే ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆమెకు రూ.250 కోట్ల భరణం ఆఫర్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
45
భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం
ఓ రిపోర్ట్ ప్రకారం, విజయ్ తన భార్యకు రూ.250 కోట్లు భరణంగా ఇవ్వనున్నారట. ఓ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం ఉందని సంగీత తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ నటి పేరును బయటపెట్టలేదు. గత రెండేళ్లుగా విజయ్‌కు దూరంగా ఉంటున్న సంగీత ఈ విషయాన్ని లేవనెత్తినట్లు చెబుతున్నారు.
55
భరణంపై వివాదం, కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

ఈ వివాదాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా, సామరస్యంగా పరిష్కరించుకుని ఈ వ్యక్తిగత సమస్యకు ముగింపు పలకాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. విడాకుల కేసుల్లో భరణం గొడవలు తరచూ ఆలస్యమవుతాయి. అందుకే కోర్టు బయటే కేసును పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై విజయ్ గానీ, సంగీత గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories