షాక్ : విజయ్ ‘ది గోట్‌’ 70% లాస్, ఇంకేం కలెక్ట్ చేస్తున్నట్లు

First Published | Sep 9, 2024, 2:47 PM IST

  ‘ది గోట్‌’చిత్రం తమిళనాడు,ఓవర్సీస్ లో అదరకొడుతున్నా మిగతా చోట్ల పెద్దగా ఆ ఇంపాక్ట్ కనపడటం లేదు.

GOAT Movie

రాజకీయ ప్రవేశానికి ముందు తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నుంచి వచ్చిన చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The Greatest of All Time Movie). వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.   భారీ అంచనాల నడుమ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా డివైడ్  టాక్‌ను సొంతం చేసుకుంది. అప్పటికి సినిమా నిండా క్యామియోలు, సర్పైజ్ ఎలిమెంట్స్ ని నింపేసారు. తమిళ ఆడియన్స్ వాటిని చూసి అసలు కథని మర్చిపోయి మరీ మురిసిపోతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆ మ్యాజిక్ జరగటం లేదు. 

the goat movie


సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమాలో ‘డీ-ఏజింగ్‌’ టెక్నాలజీని వినియోగించారు. దీని సాయంతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రలు పోషించారు. తమిళ చరిత్రలోనే భారీస్థాయిలో (తమిళనాడులో ఉన్న దాదాపు అన్ని థియేటర్లలో) ఈ సినిమా విడుదలై రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం ఇండియాలోనే రూ.135 కోట్లు సాధించింది.

Latest Videos


The GOAT


అయితే  ‘ది గోట్‌’చిత్రం తమిళనాడు,ఓవర్సీస్ లో అదరకొడుతున్నా మిగతా చోట్ల పెద్దగా ఆ ఇంపాక్ట్ కనపడటం లేదు. కర్ణాటక,నార్త్ ఇండియాలో సినిమా జస్ట్ ఓకే అన్నట్లుగా కలెక్షన్స్ సంపాదిస్తోంది. తెలుగు, కేరళ కు వచ్చేసరికి పూర్తి డ్రాప్ కనపడి , డిజాస్టర్ గా ముగిస్తోంది. ఇప్పటిదాకా ఏ పెద్ద సినిమాకు ఇలాంటి పరిస్దితి ఎదురుకాలేదు.  ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను చవిచూసింది. AP & తెలంగాణలలో, బ్రేక్ఈవెన్ 40 కోట్ల గ్రాస్ వద్ద ఉంది మరియు ఈ వెంకట్ ప్రభు చిత్రం కేవలం 9 కోట్లు వసూలు చేయగలిగింది. ఈ చిత్రం బ్రేక్‌ఈవెన్ 45 కోట్ల వద్ద ఉన్నందున కేరళలో ఏటవాలు కొండను అధిరోహించాల్సి ఉంది మరియు ఇది దాదాపు 11 కోట్లు వసూలు చేసింది.


ఈ సినిమా కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాలను చవిచూడటం ఆశ్చర్యపపరుస్తోంది. AP & తెలంగాణలలో, బ్రేక్ఈవెన్ 40 కోట్ల రావాల్సి ఉంది. అయితే  వెంకట్ ప్రభు చిత్రం కేవలం 9 కోట్లు  మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ చిత్రం కేరళలో  బ్రేక్‌ఈవెన్ 45 కోట్ల  రావాల్సి ఉంది. అయితే కేరళలో కేవలం  11 కోట్ల వరకు వసూలు చేసింది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి రెండో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?
 

the goat movie


చిత్రం కథేమిటంటే...దేశ రక్షణ కోసం ఎంతకైనా తెగించే ఓ ఏజెంట్ కథ ఇది. అనుకోని పరిస్థితుల్లో అతను ఓ మిషన్‌లో తన కొడుకును కోల్పోవలసి రావడం.. కొద్ది కాలనికే  ఆ కొడుకే 15ఏళ్ల తర్వాత తన పాలిట యముడిలా మారి దేశానికి పెను సమస్యలా మారడం.. ఈ క్రమంలో అతని ఆట కట్టించేందుకు ఆ తండ్రి ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. నిజానికి ఈ కథ (GOAT Movie Story)లో పెద్దగా కొత్తదనమేమీ లేకున్నా.. స్క్రీన్‌ప్లే స్పెషలిస్ట్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన సినిమా (GOAT Movie) కావడంతో దీంట్లో తప్పకుండా ఓ మ్యాజిక్ కనిపిస్తుందన్న భరోసా ప్రేక్షకుల్లో కపిస్తుంది. అయితే అలాంటిది జరగలేదు. 

click me!