స్టార్ హీరో వల్ల చిరంజీవిని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్.. పబ్లిక్ గా ఒప్పుకున్నాడు

First Published | Sep 9, 2024, 2:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ కొందరు ఏదో ఒక రూపంలో ఆయన పేరుతో వివాదాలు తీసుకువస్తూనే ఉంటారు. తన కెరీర్ లో చిరంజీవి అందరు దర్శకులతో సన్నిహితంగా ఉన్నారు. దర్శకులకు అనుగుణంగా వర్క్ చేస్తూనే.. తనకి తోచిన సలహాలు వారికి ఇచ్చేవారు.

మెగాస్టార్ చిరంజీవి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ కొందరు ఏదో ఒక రూపంలో ఆయన పేరుతో వివాదాలు తీసుకువస్తూనే ఉంటారు. తన కెరీర్ లో చిరంజీవి అందరు దర్శకులతో సన్నిహితంగా ఉన్నారు. దర్శకులకు అనుగుణంగా వర్క్ చేస్తూనే.. తనకి తోచిన సలహాలు వారికి ఇచ్చేవారు. చిరంజీవి అప్పట్లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు, బి గోపాల్ లాంటి అగ్ర దర్శకులతో సినిమాలు చేశారు. 

అయితే వివాదాలతో సహవాసం చేసే క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి మధ్య చాలా ఏళ్ళ క్రితం ఓ సంఘటన జరిగింది. అప్పటి నుంచి చిరంజీవి, రాంగోపాల్ వర్మ మధ్య మాటలు లేవు. వర్మ నాగార్జున, వెంకటేష్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. కానీ వర్మ, చిరు కాంబినేషన్ లో ఒక్క మూవీ కూడా రాలేదు. 

బిగ్ బాస్ తెలుగు 8 - ఏసియానెట్ పోల్


ఒక చిత్రం ప్రారంభమైంది కానీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. వర్మ, చిరంజీవి మధ్య విభేదాలే ఇందుకు కారణం. అయితే చిరంజీవికి కథ నచ్చలేదని ఆ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరిగింది. రెండు సాంగ్స్ కూడా చిత్రీకరించారు. కానీ వాస్తవం వేరు. ఆ మూవీ విషయంలో పూర్తిగా తప్పంతా నాదే అని వర్మ తెలిపారు. 

Also Read: హీరోయిన్ పైట జారితే ఒప్పుకోను..మిస్టర్ బచ్చన్, సలార్ సినిమాలపై ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్

చిరంజీవితో సినిమా చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ లోనే సంజయ్ దత్ తో నాకు కమిట్మెంట్ ఉంది. చిరంజీవి సినిమా మొదలు పెట్టినప్పుడు సంజయ్ దత్ జైలుకి వెళ్లారు. దీనితో చిరుతో సినిమా చేస్తున్నా. సరిగ్గా నెలరోజులకు సంజయ్ దత్ విడుదల అయ్యారు. దీనితో ఆయన సినిమాపై ఫోకస్ చేయక తప్పలేదు. నావల్ల చిరంజీవి ఇబ్బంది పడిన మాట వాస్తవమే.  చిరంజీవి చిత్రానికి టైం కేటాయించలేకపోయా. 

Also Read: సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో, మళ్ళీ మణికంఠకి గండం..ఆమెని సేవ్ చేసి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు

ఆ విధంగా చిరంజీవితో చిత్రం ఆగిపోయింది. అప్పట్లో నేను చిరంజీవికి బహిరంగంగా పేపర్ లో క్షమాపణ చెప్పా అని వర్మ అన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన ఊర్మిళ హీరోయిన్ గా ఎంపికైంది. కానీ ఆ కాంబినేషన్ కుదర్లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి, వర్మ మధ్య మాటలు లేవట. 

Latest Videos

click me!