కోల్డ్ ప్లే మాషప్ సింగర్ క్రిస్ మార్టిన్ లేటెస్ట్ గా అహ్మదాబాద్ లో ఒక మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. వందలాది మంది మ్యూజిక్ లవర్స్ క్రిస్ మార్టిన్ కన్సర్ట్ కోసం ఆ ప్రోగ్రాం లో పాల్గొన్నారు. క్రిస్ మార్టిన్ కు కోల్డ్ ప్లే మాషప్ సింగర్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అయితే అతను అహ్మదాబాద్ ఈవెంట్ లో క్రిస్ మార్టిన్ తాను తెలంగాణా వ్యక్తిగా చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తాను తెలంగాణ నుంచి వచ్చానని చెప్పాడు. క్రిస్ మార్టిన్ ఇంగ్లాండ్ కు చెందిన వ్యక్తి కాని అతను కొన్నాళ్లుగా తెలంగాణాలో ఉంటున్నాడు.
24
అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యూజికల్ కన్సర్ట్ లో ఐయామ్ ఫ్రం తెలంగాణా అని చెప్పడం తో అంతా షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా. తెలంగాణా ప్రజల ఈ విషయంలో సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు. ఇక ఈ విషయంలో మరో అద్భుతం జరిగింది. తెలంగాణా హీరో, టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకోండ ఈ విషయంలో స్పందించి మరో సర్ ప్రైజ్ ను తెలంగాణ ప్రజలకు అందించాడు. క్రిస్ మార్టిన్ క్లిప్ ని షేర్ చేస్తూ విజయ్ దేవరకొండ ఆయనతో గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద సాంగ్ కోల్డ్ ప్లే మాషప్ ఏర్పాటు చేయించండి అని అన్నాడు.
34
క్రిస్ మార్టిన్ వీడియోపై విజయ్ దేవరకొండ స్పందించడంతో తెలంగాణ ప్రజలతో పాటు.. విజయ్ ఫ్యాన్స్ కూడా సర్ ప్రైజ్ అవుతున్నారు. చేసింది. ఇక నిజంగానే తెలంగాణా నుంచి వచ్చా అని చెప్పుకుంటున్న క్రిస్ మార్టిన్ తో పొడుస్తున్న పొద్దుమీద సాంగ్ మాషప్ చేయిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
గద్దర్ రచించి పాడిన ఆ పాట క్రిస్ మార్టిన్ నోట వింటే స్పెషల్ గా ఉంటుంది. ఐతే విజయ్ దేవరకొండ పెట్టిన ఈ కామెంట్ ఎంతమందికి చేరుతుందో చూడాలి. చేరాల్సిన చోటికి చేరాల్సిన విధంగా చేరితే మాత్రం షార్ట్ పీరియడ్ లో క్రిస్ మార్టిన్ హైదరాబాద్ లో ఒక మ్యూజికల్ కన్సర్ట్ ఏర్పాటు చేసి అతనితో పాటలు పాడించే ఛాన్స్ ఉంటుంది.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాడ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. వరుసగా ఆయన సినిమాల నిరాశపరుస్తున్నాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా. ఎంత మంచి సినిమాలు చేసినా.. డిఫరెంట్ క్యారెక్టర్లు వేసినా.. ఏమాత్రం రిజల్ట్ రావడంలేదు. ఇక విజయ్ ప్రస్తుతం గౌతం మీనన్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. మరి విజయ్ దేవరకొండ అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ రౌడీ హీరో చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.