‘పైత్యం’ అంటూ అనసూయ షాకింగ్ ట్వీట్.. చిర్రెత్తిపోతున్న విజయ్ దేవకొండ ఫ్యాన్స్.. ఎందుకు?

First Published | May 5, 2023, 10:57 PM IST

స్టార్ యాంకర్, నటి అనసూయ  (Anasuya), విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య మళ్లీ వార్ మొదలైంది. తాజాగా అనసూయ పెట్టిన ట్వీట్ కు చిర్రెత్తి పోతున్నారు.  కామెంట్లతో కడిగేస్తున్నారు. 
 

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే.  ఆమె బుల్లితెరపై, సినిమాల్లో కంటే నెట్టింటే ఎక్కువగా కనిపిస్తుంటారు. తన ట్వీట్లతో హాట్ టాపిక్ గ్గా మారుతుంటారు. తాజాగా అనసూయ ట్వీట్ కు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 
 

గతంలో అనసూయ - విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. ‘లైగర్’రిజల్డ్ విషయంలోనూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట దుమారం రేపింది. విజయ్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విజయ్ దేవరకొండను ఉద్దేశించిన ట్వీట్ పెట్టిందంటూ మండిపడుతున్నారు.
 


అయితే, తాజాగా అనసూయ ఇలా ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది రంగమ్మత్త. ఆ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అనసూయను కామెంట్లతో బాగా ట్రోల్ చేస్తున్నారు. 

ఎందుకు నీకు సంబంధం లేని విషయాల్లో దూరుతావు అంటూ మండిపడుతున్నారు. నువ్వు ఇలా చేస్తావ్ కాబట్టే నీ విషయంలోనూ అందరూ దూరుతారు... ఆంటీ.. అంటూ మళ్లీ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ The ప్రొడక్షన్ హౌజ్ నుంచే రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నావ్ అంటూ గుర్తు చేస్తున్నారు. 
 

కాగా, విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ ఫిల్మ్ ‘ఖుషి’ Kushi. సమంత జోడీగా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈక్రమంలో అప్డేట్స్ ను కూడా అందిస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ పైనే అనసూయ ఇలా ట్వీట్ చేశారని భావిస్తున్నారు. 
 

చిత్ర పోస్టర్ లో ‘The Vijay Deverakonda’ అని ఉండటమే అనసూయ కారణమని విజయ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై విజయ్ దేవరకొండపైనా పలువురు విమర్శలు కూడా చేశారు. సీనియర్ హీరోలే అలాంటి పదాలు వాడలేదు అని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అనసూయ ట్వీట్ సంచలనంగా మారింది.
 

Latest Videos

click me!