విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు ఫ్యామిలీ కథలు, బోల్డ్ మూవీస్ చేశారు. `పెళ్లి చూపులు`, `గీతా గోవిందం`, `డియర్ కామ్రేడ్`, `ఖుషి`, `ఫ్యామిలీ స్టార్` వంటి చిత్రాలన్నీ ఫ్యామిలీలవ్ ప్రధానంగా సాగే మూవీ. `వరల్డ్ ఫేమస్ లవర్` కూడా కొంత ఆ కోవకు చెందిందే. `అర్జున్ రెడ్డి` బోల్డ్ మూవీగా నిలుస్తుంది. `లైగర్` యాక్షన్ మూవీ. ఇందులో చాలా వరకు ఫ్యామిలీ సినిమాలే అంతో ఇంతో ఆదరణ పొందాయి. అయితే ఇకపై మాత్రం ఆయన రూట్ మార్చాడు. పూర్తి భిన్నమైన చిత్రాలతో రాబోతున్నారు.