
విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా అతడు నటిస్తున్న మూడు సినిమాల క్రేజీ అప్డేట్లు వచ్చాయి. రణబాలి, రౌడీ జనార్ధన చిత్రాల అప్డేట్స్ తో పాటు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన అప్డేట్లు వచ్చాయి.
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విశెస్ చెబుతూ "రణబాలి" మూవీ నుంచి స్పెషల్ మేకింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ హార్స్ రైడింగ్ కోసం ఎంతగా హార్డ్ వర్క్ చేశారు. ఎలాంటి కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు అనేది ఈ బర్త్ డే గ్లింప్స్ లో చూపించారు. స్టాలియన్ అనే బ్రీడ్ కు చెందిన గుర్రాలను స్వారీ చేయడం చాలా కష్టం. అయితే సినిమా కోసం ఎంతైనా కష్టపడే విజయ్...చాలా ప్రయత్నాలు చేసి, గాయాలకు తట్టుకుని సక్సెస్ ఫుల్ గా హార్స్ రైడింగ్ చేయడం ఈ గ్లింప్స్ లో ఆకట్టుకుంటోంది. 'ఈ సన్నివేశాలు స్క్రీన్ మీద చూసేందుకు చాలా బాగుంటాయి, అందుకే ఇలాంటి కష్టతరమైన సీన్స్ చేస్తున్నాను..' అని విజయ్ చెప్పడం ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్ ను తెలియజేస్తోంది. రణబాలి పాత్రలో విజయ్ చేసే హార్స్ రైడింగ్ సీన్స్, హార్స్ తో పాటు చేసే భారీ యాక్షన్ సీక్వెన్సులు ఈ మూవీలో హైలైట్ కానున్నాయి. "రణబాలి" సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది.
హీరో విజయ్ దేవరకొండ భారీ పాన్ ఇండియా లైనప్ లో వైరా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ ప్రదీప్ ఉప్పలపాటి నిర్మాణంలో దర్శకుడు శౌర్యువ్ రూపొందిస్తున్న మూవీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది. టాప్ ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ ఈ మూవీకి వర్క్ చేస్తుండటం విశేషం. ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. 'ప్రపంచం వ్యతిరేకించినా, విధి అతన్ని రాజును చేసింది..' అంటూ బర్త్ డే పోస్టర్ పై రాసిన క్యాప్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చేతిలో ఖడ్గంతో సింహాసనంపై కూర్చుని ఉన్న విజయ్ స్టిల్ తో ఈ పోస్టర్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ ఈ మూవీకి పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లా విజయ్ శౌర్యువ్ మూవీ కూడా ప్రయత్నిస్తోంది. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది.
ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు "రౌడీ జనార్థన" మూవీ మేకర్స్. ఈ బర్త్ డే పోస్టర్ లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్ తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన ఛాతీపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు పెట్టినట్లు చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్ యాక్షన్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ ను ఎస్టాబ్లిష్ చేస్తోంది. "రౌడీ జనార్థన" సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.