విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దీనితో నేడు చిత్ర యూనిట్ సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ అద్భుతంగా ప్రసంగించారు. ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా.నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొందరు డబ్బులు ఖర్చు చేయిస్తున్నారు.