నా సక్సెస్ కి కారణం రష్మీనే, లైఫ్ లో అందరికంటే ఆమే నాకు ఎక్కువ.. స్నేహితులకు సుధీర్ వెన్నుపోటు ?

Published : Sep 04, 2023, 09:25 PM IST

జబర్దస్త్ షోతో బుల్లితెరపై సుధీర్ తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తింగరోడిగా కనిపిస్తూనే కామెడీ పంచ్ లతో సుధీర్ కడుపుబ్బా నవ్వించడం చూశాం. ఇక సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

PREV
16
నా సక్సెస్ కి కారణం రష్మీనే, లైఫ్ లో అందరికంటే ఆమే నాకు ఎక్కువ.. స్నేహితులకు సుధీర్ వెన్నుపోటు ?

జబర్దస్త్ షోతో బుల్లితెరపై సుధీర్ తిరుగులేని ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. తింగరోడిగా కనిపిస్తూనే కామెడీ పంచ్ లతో సుధీర్ కడుపుబ్బా నవ్వించడం చూశాం. ఇక సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ ఆడియన్స్ ని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   అయితే ఇతర ఛానల్స్ లో అవకాశాలు రావడం, హీరోగా కూడా బిజీ అవుతుండడంతో ఆ మధ్యన సుధీర్ జబర్దస్త్ ని వదిలేశాడు. 

26

  గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్ లాంటి చిత్రాలతో హీరోగా మారాడు. రష్మీతో కెమిస్ట్రీ సుధీర్ కి బాగా అడ్వాంటేజ్ అయింది. మంచి ప్రచారం కల్పించేలా చేసింది. సుధీర్, రష్మీ మధ్య నిజంగా కెమిస్ట్రీ ఉందో లేదో అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రం వీరిద్దరో లవ్ బర్డ్స్ లాగే బిహేవ్ చేశారు.   

36

  సుధీర్ వేరే ఛానల్స్ కి వెళ్లిపోవడంతో.. రష్మీ, సుధీర్ కెమిస్ట్రీని ఆడియన్స్ మిస్ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత సుధీర్, రష్మీ కలిశారు. ఒకే వేదికపై సందడి చేశారు. ఒక ప్రత్యేక ఈవెంట్ లో సుధీర్, రష్మీ పాతరోజులని గుర్తు చేసే విధంగా ప్రేమ పాఠాలు వల్లించారు. చాలా రోజుల తర్వాత రష్మీ, సుధీర్ తమలోని రొమాంటిక్ యాంగిల్ బయటకి తీసి ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చారు. 

46

ప్రముఖ ఛానల్ కి చెందిన వార్షికోత్సవ వేడుకలో సుధీర్ రష్మీ పాల్గొని 'నిజమే చెబుతున్నా జానే జానా' అనే సాంగ్ కి డ్యాన్స్ చేశారు. తాము జంటగా ఎప్పుడు కనిపించినా రొమాన్స్ దిరిపోతుందని ఈ సాంగ్ తో నిరూపించారు. అంతే కాదు నిర్వాహకులు స్క్రీన్ పై సుధీర్, రష్మీ పాత వీడియోల్ని ప్రదర్శించారు. దీనితో సుధీర్ రష్మీ ఎమోషల్ అయ్యారు. 

56

సుధీర్ మాట్లాడుతూ రష్మీతో నాది బ్యూటిఫుల్ జర్నీ అని తెలిపాడు. వెంటనే రియాక్ట్ అయిన గెటప్ శ్రీను ఏంటి ? బ్యూటిఫుల్ జర్నీనా లేక లవ్ జర్నీనా ? అని ప్రశ్నించాడు. సుధీర్ సిగ్గు పడుతూ.. బేసిక్ గా రష్మీ కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి. నా వరకు అందరికంటే రష్మినే ఎక్కువ అంటూ పొగడ్తలు కురిపించారు. నిజం చెప్పాలంటే నా జర్నీలో, విజయంలో కీలక పాత్ర రష్మీదే అంటూ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

66

ఇది ఒకరకంగా హాట్ కామెంట్ ని చెప్పాలి. ఎందుకంటే సుధీర్ విజయంలో కీలక పాత్ర పోషించింది ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనే చెప్పాలి. వీరు ముగ్గురూ కలసి చేసిన స్కిట్స్ ప్రతిసారి హైలైట్ అయ్యాయి. ఒకరకంగా స్నేహితులకు సుధీర్ వెన్నుపోటు పొడిచాడు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను కలసి చాలా స్కిట్స్ లో సుధీర్ పాత్రని హైలైట్ చేశారనే అభిప్రాయం చాలా మందిలోఉంది. 

click me!

Recommended Stories