పెళ్లి చూపులు నుంచి లైగర్ వరకూ విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? రౌడీ హీరో టాప్ సీక్రెట్

Published : Jun 03, 2022, 04:59 PM IST

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్టేటస్ కు వెళ్లడం.. అది కూడా అతి తక్కువ టైమ్ లో అంటే అందరికి సాధ్యం కాదు అది సాధించి చూపించాడు విజయ్ దేవరకొండ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.  మరి విజయ్ రెమ్యూనరేషన్ సంగతి ఏంటీ..? పెళ్ళి చూపులు నుంచి లైగర్ వరకూ విజయ్ ఎంత రేటు పెంచాడు..? ఒక్కొ సినిమాకు ఎంత తీసుకున్నాడు. చూద్దాం. 

PREV
110
పెళ్లి చూపులు నుంచి లైగర్ వరకూ విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? రౌడీ హీరో టాప్ సీక్రెట్

ప్రతి సినిమాకి విజయ్ దేవరకొండ పాపులారిటీ తో పాటు పారితోషకం కూడా పెరుగుతూ వస్తోంది. . పెళ్లిచూపులు నుండి ఇప్పటివరకు అంచెలంచెలుగా పైకి ఎదిగిన విజయ్ పారితోషకం ఎంతో ఇప్పుడు చూద్దాం.

210

విజయ్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా పెళ్లిచూపులు. ముందు బడ్జెట్ అసలు సరిపోలేదు అని దాంతో విజయ్ దేవరకొండ బంధువైన యష్ రంగినేని నిర్మాణంలో కొంత సహాయం చేశారు.  పోషించారు అని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఆ సినిమాకి విజయ్ అందుకున్న రెమ్యూనరేషన్ ఐదు లక్షలు.

310

పెళ్లి చూపులు సినిమా విజయ్ కి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత ద్వారకా లాంటి కమర్షియల్ సినిమా చేశాడు. దర్శకుడు సినిమా నెరేట్ చేసినప్పుడు ఒకలాగా ఉంది అని తర్వాత షూటింగ్ జరిగేటప్పుడు సినిమా ఇంకొక లాగ వచ్చింది అని. షూటింగ్ సమయంలోనే ఫలితం అర్థమైపోయింది అని కానీ సినిమా ఒప్పుకోవడం తన నిర్ణయమే అని కాబట్టి రిగ్రెట్ చేయడం లేదు విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈసినిమాకు విజయ్ ఏకంగా 20 లక్షలు  తీసుకున్నాడు. 

410

విజయ్ కు ఎక్కడలేని స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. అమ్మాయిన ఈ సినిమాతో గ్రీకు వీరుడిగా ముద్ర పడిపోయాడు. ఈ సినిమా పెళ్లిచూపులు తర్వాత మొదలైంది. కానీ షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ బ్లక్ బస్టర్ మాస్ మూవీకి విజయ్ 5 లక్షలు మాత్రమే తీసుకున్నాడు. 

510

పెళ్లిచూపులు తర్వాత విజయ్ సైన్ చేసిన సినిమా గీత గోవిందం. అప్పటికి అర్జున్ రెడ్డి విడుదల కాలేదు. దాంతో  ఈమూవీకి కూడా  ఐదు లక్షలు పారితోషకం తీసుకున్నాడు విజయ్. ఈ సినిమా ద్వారా విజయ్ తన మొట్టమొదటి కమర్షియల్ మూవీ సక్సెస్ అందుకున్నాడు.

610

ఆవెంటనే విజయ్ చేసిన ప్రయోగాలు బెడిసికొట్టాయి అందులో నోటా కూడా ఒకటి. తమిళ్ లో రూపొంది తెలుగులోకి అనువాదం అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాకు మాత్రం  విజయ్ క్రేజ్ పెరగడం వల్ల 5 కోట్ల వరకూ తీసుకున్నాడు. 
 

710

ముందే స్టార్ట్ అయినా.. లేట్ గా రిలీజ్ అయిన సినిమా టాక్సీ వాలా. అనుకున్నంతగా కాకపోయినా ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా.. మంచి కథతో విజయ్ కెరీర్ కు బాగా ఉపయోగపడింది. యావరేజ్ సినిమా అయినా.. ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ను క్రీయేట్ చేసింది. ఇక ఈసినిమాకు విజయ్ అందుకున్న  పారితోషికం 5 కోట్లు. 
 

810

తెలుగులో రూపొంది తమిళ, కన్నడ, మలయాళ, భాషల్లో కూడా విడుదలైన  సినిమా డియర్ కామ్రేడ్.  థియేటర్లలో సరిగ్గా ఆడలేదు కానీ ఎంతోమంది ప్రశంసలు అందుకున్న ఈసినిమా.. అండర్ రేటెడ్ సినిమాల జాబితాలో చేరింది. ఇక డియర్ కామ్రేడ్ సినిమా కోసం విజయ్ ఏకంగా 1 0 కోట్లు పుచ్చుకున్నాడట. 

910

ఇక విజయ్ దేవరకొండ నటించిన  వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చూస్తే.. అర్జున్ రెడ్డి సినిమాకి సీక్వెల్ చూసినట్టుగా ఉంటుంది. సినిమానే కాదు పోస్టర్లు కూడా కొన్ని అలానే అనిపించాయి. కాని ఈ సినిమా మాత్రం అర్జున్ రెడ్డి ఛాయలకు కూడా వెళ్ళలేకపోయింది. అయితే అప్పటికే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ దృష్ణిలో ఉంచుకుని విజయ్ కు 10 కోట్లు ముట్టజెప్పారు.   

1010

వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నా కాని.. విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తరువాత విజయ్ నుంచి వస్తున్న సినిమా లైగర్. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో  తెరకెక్కుతోంది. ఈ సినిమా మీద ప్రేక్షకులందరికీ భారీగా అంచనాలు ఉన్నాయి. విజయ్ కూడా ఈ సినిమా కోసం అంతే ఎక్కువగా కష్టపడుతున్నాడు. పోయిన చోటే తిరిగి తెచ్చుకోవాలి అని అంటారు. నాలుగు భాషల్లో విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ ఏ ఒక్క భాషలో కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు లైగర్ పాన్ ఇండియా మూవీగా  రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు విజయ్ 15 కోట్ల వరకూ తీసుకున్నట్టు సమాచారం. 

click me!

Recommended Stories