త్రివిక్రమ్ తరువాతే ఎవరైనా అంటున్న విజయ్ దేవరకొండ, మరి ఈ కాంబోలో సినిమా ఎప్పుడంటే..?

First Published | Mar 22, 2022, 8:00 AM IST

విజయ్ దేవరకొండ కెరీర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో వరుసగా రెండు ప్లాప్ లు పడేసరికి.. ఇక సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి అని చూస్తున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాలపై కూడా గట్టిగా ఫోకస్ పెట్టాడు. త్రివిక్రమ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడట రౌడీ హీరో. 

విజయ్ దేవరకొండకి వెంటవెంటనే రెండు ఫ్లాపులు పడ్డాయి. దాంతో గ్యాప్ లేకుండా లైగర్ తో ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండ కరోనా దెబ్బ గట్టిగా తగలడంతో.. అనుకున్న దానికంటే ఇంకా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత విజయ్ సినిమాల లిస్ట్ లో త్రివిక్రమ్ కూడా చేరినట్టు తెలుస్తోంది. 

లైగర్ తరువాత ఇద్దరు డైరెక్టర్లకు విజయ్ దేవరకొండ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇఛ్చాడు. అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు కూడా. అందులో జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. విజయ్ ను సుకుమార్ మార్క్ హీరోగా చూడాలని తాపత్రేయ పడుతున్నారు. 
 


ఇక సుకుమార్ తరువాత  శివ నిర్వాణతోను విజయ్ దేవరకొండ సినిమా చేయాల్సి ఉంది. పుష్ప 2తో సుకుమార్ బిజీ కానున్నాడు కాబట్టి.. లైగర్ తరువాత  శివ నిర్వాణతో విజయ్ దేవరకొండ సినిమా ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యలో త్రివిక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. 
 

విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి చాలా మంది డైరెక్టర్స్ కథలు రెడీ చేసుకుని మరీ.. ఉత్సాహాన్ని చూపుతున్నారట. కథలతో ఆయనను కలిస్తే, వచ్చిన ప్రతీ ఒక్క డైరెక్టర్ కు త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తరువాత చూద్దాంఅని విజయ్ అంటున్నాడట. మహేశ్ బాబుతో సినిమా తరువాత త్రివిక్రమ్ విజయ్  సినిమానే చేస్తాడంటూ రూమర్ గట్టిగా నడుస్తోంది. 

ఒక వేళ మహేష్ త్రివిక్రమ్ సినిమా లేట్ అవుతుంది అనుకుంటే ఈలోపు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమాను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. విజయ్ ఆలోచన ఎలా ఉందో తెలియదు కాని.. ఇంత వరకూ ఎవరూ ఊహించని కాంబినేషన్ లో సినిమా అంటే.. ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. వీరిద్దరి రూట్స్ వేరు. మాస్ హీరోగా విజయ్ కు స్టార్ డమ్ ఉంది. అఫ్ కోర్స్ గీతాగోవిందం సినిమాతో క్లాస్ కూడా చేయగలడు అని నిరూపించుకున్నాడు. త్రివిక్రమ్ స్టైల్ ల్లో హీరోగా విజయ్ ను రకరకాలు గా ఊహించుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్. 
 

అయితే తివిక్రమ్ తో సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. త్వరలో చేస్తారంటూ ఊహాగానాలు అయితే తిరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్ సర్కిల్ లో గుసుగుసలు అయితే వినిపిస్తున్నాయి కాని.. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది మాత్రం తెలియదు. ఇది ఊహాగానాలకే పరిమితం అవుతందా..? లేక సినిమాగా సెట్స్ ఎక్కుతుందా అనేది చూడాలి. 
 

అటు విజయ్ మాత్రం పక్కాగా ప్లానింగ్ ప్రాకారం వెళ్తున్నాడు. పూరీతో లైగర్ తరువాత ఆయన ను తన్నుకు పోవాలి అని బాలీవుడ్ డైరెక్టర్లు కూడా లైన్ లో ఉన్నారు. ఇటు టాలీవుడ్ నుంచి కూడా దర్శకులు రెడీగా ఉన్నారు. మరి రౌడీ హీరో నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుందో చూద్దాం. 
 

Latest Videos

click me!