చలించిపోయిన విజయ్ దేవరకొండ, కష్టాల్లో ఉన్న పేద డాన్సర్ కు భారీ సాయం

Published : Sep 15, 2022, 06:39 PM IST

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన మంచి మనసు చాటుకున్నారు. కష్టల్లో ఉన్న వారికోసం ఇప్పటిచే చాలా మంచి పనులు చేసిన  యంగ్ హీరో.. రీసెంట్ గా ఓ పేద డాన్సర్ ను  చూసి చలించిపోయాడు. ఆదుకుంటానంటూ భారీ సాయం ప్రకటించారు.   

PREV
16
చలించిపోయిన విజయ్ దేవరకొండ, కష్టాల్లో ఉన్న పేద డాన్సర్ కు భారీ సాయం

తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా  మొట్టమొదటిసారిగా ఆహా వేదికగా డాన్స్ ఐకాన్ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఈ డాన్స్ షో లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ మంచి తనం మరోసారి బయటపడింది. ఆయన చేసిన సహాయం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. 

26

ఆహాలో డాన్స్ ఈవెంట్ సందర్భంగా  పెద్ద ఎత్తున సెలబ్రిటీలు సందడి చేశారు. ప్రముఖ యాంకర్ ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న.. ఈ ప్రోగ్రామ్ లో గెలిచినవారికి స్టార్ హీరోను  కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ  లాస్ట్ మన్త్ లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా  కంటెస్టెంట్స్ చేసే పెర్ఫామెన్స్ కు ఫిదా అయ్యాడు రౌడీ హీరో.  అందులో ఒక కంటెస్టెంట్ బాధలు విని కరిగిపోయాడు. 

36

ఆనంద్ అనే కంటెస్టెంట్ అమ్మ సెంటిమెంటుతో వేదికపై డాన్స్ చేశారు. ఇక తన గురించి హోస్ట్  చెబుతూ ఆనంద్ కు అమ్మ అంటే ఎంతో ఇష్టం అందుకే అమ్మ పాట ద్వారా వేదిక పైకి వచ్చారని..  ఆనంద్ తల్లి ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారని తనకి తన తల్లికి హాస్పిటల్లో చికిత్స చేయించడానికి డబ్బులు ఇబ్బందిగా ఉందని బాధపడ్డారు. 
 

46

అంతే కాదు మంచి డాన్సర్ గా ఉన్న అతనికి వేసుకోవడానికి బట్టలు లేవు.. డాన్స్ కోసం  ఒక మంచి కాస్ట్యూమ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో సాధారణ దుస్తులతో వేదికపైకి వచ్చి డాన్స్ చేస్తున్నారని ఓంకార్ చెప్పగానే విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయ్యారు.అతని డాన్స్ ను మెచ్చుకుంటూనే.. గతంలో తాను అనుభవించిన కష్టాలు కూడా గుర్తు చేసుకున్నాడు. 
 

56

తను ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేస్తున్న సమయంలో తన దగ్గర కూడా సరైన బట్టలు లేవని ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రొడ్యూసర్ ని అడిగి సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకొని ప్రమోషన్ కి వెళ్ళానని తెలిపారు.  అంతే కాదు కాస్ట్యూమ్ లేవని బాధపడకు అని ఓదార్చుతూ.. తను రన్ చేస్తున్న రౌడీ వేర్ నుంచి తనకు కావల్సినన్న ఫ్యాషన్ వేర్స్ పంపుతానని తనకు నచ్చిన స్టైల్ వేసుకుని పర్ఫామెన్స్ చేయమని  విజయ్ దేవరకొండ ప్రకటించాడు. 

66

విజయ్ దేవరకొండ మంచితనం గురించి గతంలో కూడా చాలా సార్లు చూశాం. కరోనాతో ఇబ్బందిపడుతున్న మిడిల్ క్లాస్ వారికి.. నిత్యవసరాలు సహాయం చేయడంతో పాటు... ఇంకెన్నో మంచి పనులు చేశారు. హీరోగానే కాకుండా సమాజిక బాధ్యతలు కూడా స్వీకరిస్తూ.. అందరి మన్ననలు పొండాడు రౌడీ హీరో.  ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి మూవీ చేస్తున్నాడు విజయ్. 

click me!

Recommended Stories