వధూవరులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. నెట్టింట వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ పిక్..

Published : Nov 22, 2022, 04:32 PM ISTUpdated : Nov 22, 2022, 06:04 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ - స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారారు. కొద్దికాలంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని పుకార్లు షికారు చేస్తుండగా.. తాజాగా వీరి ఫ్యాన్ మేడ్ పిక్ ఒకటి వైరల్ గా మారింది.  

PREV
16
వధూవరులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. నెట్టింట వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ పిక్..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) టాలీవుడ్ లో యంగ్ స్టార్స్ గా దూసుకుపోతున్నారు. అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని తారా స్థాయికి చేరుకున్నాయి. 
 

26

‘గీతా గోవిందం’,‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కలిసి నటించారు. గీతాగోవిందంలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్ ఫుల్ ఫిదా అయ్యారు. రొమాన్స్ తోనూ అదరగొట్టడంతో విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్ పైనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్  లోనూ లవ్ ట్రాక్ కొనసాగిస్తున్నారంటూ అప్పటి నుంచే వార్తలు పుట్టుకొచ్చాయి. 
 

36

ఇప్పటికే విజయ్,  రష్మిక ఘాడమైన ప్రేమలో ఉన్నారని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే వీరి కదలికలూ కనిపిస్తున్నాయి. గతంలో బెంగళూరులోని ఓ రెస్టారెంట్ లో కనిపించారు. విజయ్ ఫ్యామిలీతో  రష్మిక క్లోజ్ గానూ మూవ్ అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా మాల్దీవులకూ కలిసే వేకేషన్ కు వెళ్లినట్టు ఫొటోలు చెబుతున్నాయి.
 

46

వీరి లవ్ స్టోరీపై వస్తున్న రూమర్లను ఇటు విజయ్ దేవరకొండ, అటు రష్మిక మందన్న ఎప్పుడూ ఖండించలేదు. పలు ఇంటర్వ్యూల్లోనూ మంచి స్నేహితులమనే చెప్పుకురావడం మరింత ఇంట్రెస్టింగా మారింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వీరి పేర్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
 

56

పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్ లో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట  తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటోలను విజయ్ అభిమాని ఒకరు ఫొటోషాప్ చేసి నెట్టింట వదిలారు. ‘ఇది ఇప్పుడు ఎడిటింగే కావొచ్చు.. ఫ్యూచర్ లో నిజం కానుంది’ అంటూ విజయ్, రష్మిక లవ్ పై జోష్యం చెప్పారు. 

66

తాజాగా ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) నటించిన ‘బేబీ’టీజర్ కూడా విడుదల కావడంతో విజయ్, రష్మిక ఇద్దరూ ఒకేసారి సోషల్ మీడియాలో స్పందించడం ఆసక్తికరంగా మారింది. ఏదోలా  ఈ స్టార్స్ లవ్ లోనే ఉన్నట్టు బయటపడుతూ వస్తోంది. ‘లైగర్’తో దెబ్బతిన్న విజయ్ ‘ఖుషీ’తో సక్సెస్ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories