పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్‌.. `హరిహర వీరమల్లు` నుంచి ఫస్ట్ సాంగ్‌, స్పెషల్‌ ఏంటంటే?

Published : Dec 27, 2024, 05:19 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నుంచి అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ రాబోతుంది. కొత్త ఏడాది సందర్భంగా `హరిహర వీరమల్లు` సినిమా నుంచి సర్‌ప్రైజ్‌ రాబోతుంది.   

PREV
15
పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ ట్రీట్‌.. `హరిహర వీరమల్లు` నుంచి ఫస్ట్ సాంగ్‌, స్పెషల్‌ ఏంటంటే?

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ రాబోతుంది. కొత్త ఏడాది సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతుంది `హరిహర వీరమల్లు` టీమ్‌. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్లు వచ్చాయి. పలు యాక్షన్‌ సీన్లతో అభిమానులను అలరించారు పవన్‌. ఇక ఇప్పుడు సాంగ్‌ రిలీజ్‌ చేయబోతున్నారు. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. 
 

25

అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఈ పాట పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌తో ఉండబోతుందట. పాట కూడా ఆయనే పడతాడని అంటున్నారు. దీంతో ఈ వార్త తెలిసి పవన్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పుడే సెలబ్రేషన్‌ షురూ చేస్తున్నారు. క్రిష్‌ స్థానంలో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌.. వీరమల్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా చేస్తుంది. బాబీ డియోల్‌ ఔరంగాజేబ్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీ ఇది. పవన్‌ నుంచి వస్తోన్న మొదటి పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. దీనికితోడు హిస్టారికల్‌ నేపథ్యంలో తెరకెక్కుతుంది. కొహినూర్‌ వజ్రం కోసం సాగే పోరాటం ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 
 

35

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. షూటింగ్‌కి సంబంధించిన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిది నిమిషాల సీన్‌ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. దానికోసం ఏకంగా 15కోట్లు అవుతుందట. 42 రోజులు షూటింగ్‌ జరుపుతున్నారట. ఒకే ఒక్క సీక్వెన్స్ కోసం పవన్‌ 42 రోజుల కాల్షీట్లు ఇస్తున్నాడని తెలుస్తుంది. `బ్రో` సినిమానే ఇరవై రోజుల్లో కంప్లీట్‌ చేశాడు. ఇప్పుడు 42 రోజులు ఒకే సీక్వెన్స్ కోసం డేట్స్ ఇస్తున్నాడంటే అది ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. 
 

45

`హరిహర వీరమల్లు` సినిమాలో పవన్‌ ఎంట్రీ సీన్‌ మచిలీపట్నం పోర్ట్ ఫైట్‌తో ప్రారంభమవుతుందట. ఆ సీక్వెన్స్ హైలైట్‌గా ఉండబోతుందట. దీంతోపాటు టీజర్‌లో చూపించిన రెడ్‌ డ్రెస్‌లో ఫైట్‌ క్లైమాక్స్ లో రాబోతుందట. క్లైమాక్స్ ఫైట్‌ తర్వాత ఎనిమిది నిమిషాల బ్యాంగ్‌ ఉంటుందని, దాని కోసమే ఏకంగా 15 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఇది చాలా వరకు వీఎఫ్‌ఎక్స్ తో కూడిన సీన్‌ అని తెలుస్తుంది. థియేటర్‌లో అది వేరే లెవల్‌లో ఉండబోతుందని అంటున్నారు. సినిమాని పాన్‌ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. మార్చిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో పవన్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. 
 

55

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉన్నారు. టైమ్‌ దొరికినప్పుడు ఆయన సినిమాల షూటింగ్‌కి టైమ్‌ ఇస్తున్నారు. మొదట `హరిహర వీరమల్లు` సినిమా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత `ఓజీ` సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నారట. అయితే `హరిహర వీరమల్లు` సినిమాని రెండు పార్ట్ లుగా తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మార్చిలో మొదటి భాగం రిలీజ్‌ కానుంది. 

read more: కిచ్చ సుదీప్‌ `మాక్స్` మూవీ రివ్యూ, రేటింగ్‌
 

also read: `డ్రింకర్‌ సాయి` మూవీ రివ్యూ, రేటింగ్‌

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories