చిరంజీవి దండకారణ్యంలోకి వెళ్లారు, నాకు దొరికిన గొప్ప హీరోలు వాళ్లిద్దరే.. లెజెండ్రీ లిరిసిస్ట్ కామెంట్స్

Published : Aug 21, 2025, 08:45 AM IST

చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు లెజెండ్రీ లిరిసిస్ట్ వేటూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఆయన దండకారణ్యంలోకి వెళ్లినట్లుగా అభివర్ణించారు. 

PREV
15
చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ షురూ 

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి గురించి, ఆయన కెరీర్ గురించి ఫ్యాన్స్ ఆసక్తికర విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. సెలెబ్రిటీలు చిరంజీవిపై చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

25
రాజకీయాల్లో చిరంజీవి

చిరంజీవి ఏడేళ్లపాటు రాజకీయాల్లో గడిపారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడం ఆ తర్వాత నెమ్మదిగా రాజకీయాలకు దూరం జరుగుతూ రావడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల్లో లేరు. కంప్లీట్ గా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నప్పుడు లెజెండ్రీ లిసిరిస్ట్ వేటూరి సుందర రామ మూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

35
వేటూరి పాటలు 

వేటూరి చిరంజీవివి చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, అబ్బనీ తీయని దెబ్బ, యమహా నగరి, ఇందు వదన కుందరదన ఇలా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని వేటూరి చిరంజీవి కోసం రాశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఒక కార్యక్రమంలో వేటూరితో కలిసి పాల్గొన్నారు.  

45
చిరంజీవి దండకారణ్యంలోకి వెళ్లారు 

వేటూరి, చిరంజీవి, కోదండరామిరెడ్డి మరికొందరు సినీ ప్రముఖులు వేదికని పంచుకున్నారు. వేటూరి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నా 40 ఏళ్ళ సినీ కెరీర్ లో మూడవ దశకానికి, నాల్గవ దశకానికి హీరో చిరంజీవి. అలాంటి చిరంజీవి నా గురించి మాట్లాడుతుంటే 75 వ ఏట కూడా నాకు పులకరింత, పూనకం కలుగుతున్నాయి. ఈ మధ్యన చిరంజీవి గారు బృందావనం లాంటి సినిమాలని వదిలి దండకారణ్యం లాంటి రాజకీయాల్లోకి వెళ్లారు. 

55
నాకు దొరికిన గొప్ప హీరోలు వాళ్లిద్దరే 

సీతా కొక చిలులతోనూ, రామ చిలుకలతోనూ రాగాలు తీసుకుంటూ ఉండాల్సిన చిరంజీవి ఇప్పుడు అసెంబ్లీ అనే పద్మ వ్యూహంలో ఉన్నారు అంటూ వేటూరి కామెంట్స్ చేశారు. చిరంజీవి తెరమీద హీరో కాదు తెర వెనుక హీరో. మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు మల్లిజాజి అల్లుకున్న రోజు అని నేను చిరంజీవి గారికి రాసిన పాట పదికాలాలపాటు జనాల్లో ఉంటుంది. ఆ పాటని నాచేత రాయించిన కోదండ రామిరెడ్డిగారు కూడా ఇక్కడే ఉన్నారు.  నేను పాటల రచయితగా మారిన తర్వాత నాకు దొరికిన ఇద్దరు గొప్ప హీరోలు.. ఒకరు ఎన్టీఆర్.. మరొకరు చిరంజీవి అని వేటూరి తెలిపారు.  

Read more Photos on
click me!

Recommended Stories