ముంబయి హీరోయినైతే చాలు కుక్కలకు కూడా స్పెషల్‌ రూమ్‌లు.. ఇండస్ట్రీలో వివక్షపై జయసుధ సంచలన వ్యాఖ్యలు

Published : Jul 30, 2022, 07:17 AM IST

అలనాటి స్టార్‌ హీరోయిన్‌, సహజ నటి జయసుధ టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆమె హీరోయిన్ల వివక్షపై షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో లోపాలను బయటపెట్టారు. 

PREV
16
ముంబయి హీరోయినైతే చాలు కుక్కలకు కూడా స్పెషల్‌ రూమ్‌లు.. ఇండస్ట్రీలో వివక్షపై జయసుధ సంచలన వ్యాఖ్యలు

ఐదు దశాబ్దాలపాటు చిత్ర పరిశ్రమలో తిరుగులోని నటిగా రాణించారు జయసుధ(Jayasudha). ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా వెలిగారు. ఎన్టీఆర్‌,ఏఎన్నార్‌, శోభన్‌బాబు వంటి మొదటితరం హీరోలతో కలిసి నటించి ఆడిపాడారు. అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అనేక సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచారు. అయితే ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. తన పాత్రకి ప్రాధాన్యత ఉంటేనే చేస్తున్నారు. 
 

26

సహజనటిగా పేరుతెచ్చుకున్న ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, నటిగా రంగులేసుకుని యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది Jayasudha. ఐదు దశాబ్దాల సుధీర్ఘ కెరీర్‌లో అనేక మైళ్లు రాళ్లు అదిగమించి ఇండస్ట్రీలో సక్సెస్‌లో తనూ ఓ భాగమయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె `ఓపెన్‌ విత్‌ ఆర్కే` టాక్‌ షోలో పాల్గొన్నారు. ఇందులో అనేక సంచలన విషయాలను వెల్లడించారు. హీరోయిన్లపై ఉన్న వివక్ష గురించి మాట్లాడారు.
 

36

తాను స్టార్‌ హీరోయిన్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎప్పుడైనా హీరోలతో పోల్చితే హీరోయిన్లపై వివక్ష ఉందన్నారు. ముంబయి హీరోయిన్‌ అయితే బెటర్‌ అని, బాంబే నుంచి హీరోయిన్‌ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్‌ రూమ్‌లిస్తున్నారని ఇండస్ట్రీపై, మేకర్స్ పై హాట్‌ కామెంట్‌ చేశారు. తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందన్నారు. అదే సమయంలో `పద్మశ్రీ`లాంటి అవార్డులకు మేము పనికిరామా అంటూ ఘాటుగా స్పందించారు. ఇటీవల కంగనారనౌత్‌కి `పద్మశ్రీ` పురస్కారం ఇచ్చిన నేపథ్యంలో ఆమెతో ప్రభుత్వానికి ఏం అవసరం ఉందో అంటూ సంచలనాలకు తెరలేపారు. 

46

తన ఎన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడైనా ఎక్కువగా డిమాండ్‌ చేసినా, ఎక్కువగా ఇబ్బంది పెట్టినా, ఇన్నేళ్లు నటిగా ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారుకాదని, ఎప్పుడో పంపించేవారని అన్నారు జయసుధ. డామినేషన్‌ అనేది హీరోల్లో ఉండదని, కానీ వారి పక్కన ఉన్న వాళ్లతోనే అసలు సమస్య అని తెలిపారు. యాభై ఏళ్ల సినీ ప్రస్తానం గురించి చెబుతూ, నటిగా సక్సెస్‌ఫుల్‌గా 50ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు బాలీవుడ్‌లో అయితే ఫ్లవర్‌ బొకేలైనా పంపించేవారని, ఇక్కడ కనీసం అదికూడా లేదని, అదే హీరో అయితే పెద్ద హడావుడి జరిగేదని తెలిపింది. 
 

56

శోభన్‌బాబుని గుర్తు చేసుకున్న జయసుధ.. ఆయన తనని `ఏమోయ్‌` అని పిలిచేవారట. ఆయన దగ్గర్నుంచి డబ్బు సేవ్‌ చేసుకోవడం నేర్చుకోలేకపోయానని తెలిపింది. అయితే శోభన్‌బాబు చాలా సార్లు `నీకొక ప్లేస్‌ చూపిస్తాను. మీ నాన్నగారితో చెప్పి కొనుక్కో` అని చెప్పేవారట. అదే సమయంలో సావిత్రి గారి `మహానటి` అప్పుడు తీసి ఉంటే బాగుండేదన్నారు జయసుధ.

66

`మా` ఎన్నికలపై జయసుధ రియాక్ట్ అవుతూ, అమెరికా వెళ్లే ముందు ఇక్కడ `మా` ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ గోల భరించలేకే, ఒక నెల అక్కడే ఉండిపోయానని చెప్పింది. `మా` ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి చేస్తుంది అని మోహన్‌బాబు అన్నదాని గురించిచెప్పాలంటే నా 50 ఏళ్ల సినీ కెరీర్‌ అంత ఉంటుందని చెప్పింది సహజనటి. `మా` బిల్డింగ్‌పై ఆమె మాట్లాడుతూ, `మురళీ మోహన్‌ టైమ్‌ నుంచి బిల్డింగ్‌ కడతామని చెబుతున్నారు. ఇంత వరకు కట్టలేరు. ఇంకో 25ఏళ్ల కెరీర్‌ ఉంటే అప్పటికైనా `మా` భవనం కడతారని ఆశిస్తున్నా` అని చెప్పారు. ఈ పూర్తి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారం కానుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories