అయితే కరోనా సమయంలో ఓటీటీ కంటెంట్స్, వెబ్ సిరీస్ లు చూస్తుండగా.. మళ్లీ సినిమాలపై ఆసక్తి కలిగిందన్నారు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ చేయాలని వచ్చాడని, ఫన్ బకెట్ వాళ్ళతో ఓ సినిమా లీడ్ రోల్ ఒకే అయింది. అలాగే మరో సినిమా లీడ్ రోల్ కూడా ఒకే అయింది.. అప్పుడే ‘రామా రావు ఆన్ డ్యూటీ’లోనూ అవకాశం రావడంతో వెంటనే రవితేజతో కలిసి నటించానని తెలిపారు. మూవీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.