నర్సపల్లి కనకవ్వతో హైపర్ ఆది చిలిపి చేష్టలు... నాలుక కొరికి మరీ వార్నింగ్ ఇచ్చిన విలేజ్ బామ్మ!

Published : Jul 28, 2022, 05:41 PM ISTUpdated : Jul 28, 2022, 05:50 PM IST

షోలో హైపర్ ఆది చేష్టలకు విసిగిపోయిన కనకవ్వ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నాలుక కొరికి మరీ సీరియస్ అయ్యింది. కనకవ్వ డేర్ కి సెట్ లోని వారందరూ షాక్ అయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

PREV
18
నర్సపల్లి కనకవ్వతో హైపర్ ఆది చిలిపి చేష్టలు... నాలుక  కొరికి మరీ వార్నింగ్ ఇచ్చిన విలేజ్ బామ్మ!
Sridevi Drama company

సందర్భానుసారంగా ఈవెంట్స్ ఎపిసోడ్స్ ప్లాన్ చేయడంలో మల్లెమాల తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం తెలంగాణ మొత్తం బోనాల(Bonalu) జాతరలో మునిగిపోయి ఉంది. ఈ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ బోనాల స్పెషల్ గా రూపొందించారు. ఈ ఎపిసోడ్ కి నర్సపల్లె ఫేమ్ కనకవ్వ రావడం జరిగింది. ఆమె షోలో సరదా పంచ్ లతో సందడి చేశారు.

28
Sridevi Drama company


అలాగే కార్తికేయ 2 ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), హీరో నిఖిల్ వచ్చారు. అనుపమపై సైతం హైపర్ ఆది, ఇమ్మానియేల్ కొన్ని పంచ్లు ప్లాన్ చేశారు. సింగింగ్ టాలెంట్ కూడా ఉన్న తన సూపర్ హిట్ మూవీ శతమానం భవతి చిత్రంలోని మెలోడీ సాంగ్ అద్భుతంగా పాడారు. కొన్ని సాంగ్స్ కి యాంకర్స్ తో పాటు కలిసి డాన్స్ లు చేశారు. 

38
Sridevi Drama company


అనుపమ బోనాల జాతరలో తన బావ చిన్నప్పుడు తప్పిపోయాడని చెప్పగా... ఇమ్మానియేల్ ఆ తప్పిపోయిన బావను నేనే అని చెప్పడం బాగుంది. అనుపమ కమెడియన్స్, యాంకర్స్ తో కలిసి పోయి వీర కామెడీ చేసినట్లు ఉన్నారు. 

48
Sridevi Drama company


యాంకర్ రష్మీ(Anchor Rashmi Gautam), ఇంద్రజ, హైపర్ ఆది, ఆటో ప్రసాద్, వర్ష, ఇమ్మానియేల్ ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ బుల్లితెర యాంకర్స్, కమెడియన్స్ తో నిండిపోయింది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ డూప్స్ తో కొన్ని స్పెషల్ సాంగ్స్ ప్లాన్ చేశారు. అలా ఎపిసోడ్ మొత్తం సందడిగా సాగింది. ఓ సాంగ్ కి హైపర్ ఆది, కనకవ్వ పెర్ఫార్మ్ చేశారు.

58
Sridevi Drama company


అనంతరం యాంకర్ రష్మీ హైపర్ ఆది, కనకవ్వ వద్దకు వచ్చి... కనకవ్వతో పెర్ఫార్మ్ చేయడం ఎలా ఉందని అడిగింది. దానికి హైపర్ ఆది కనకవ్వకు కళ్ళతో రొమాంటిక్ సైగలు చేశాడు. హైపర్ ఆది చిలిపి సైగలకు గంగవ్వ కళ్ళతోనే ఏంటి అంటూ ప్రశ్నించింది. ఇక హైపర్ ఆది చేష్టలు శృతి మించడంతో నాలుక కొరికి స్వీట్ అండ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. 

68
Sridevi Drama company


 కనకవ్వ బాడీ లాంగ్వేజ్ చూసిన హైపర్ ఆది షాక్ తినగా.. సెట్స్ లో ఉన్నవాళ్లంతా గట్టిగా నవ్వేశారు. కనకవ్వ ఇక్కడ ఏం చేసినా అది ఫన్ కోసమే అని గమనించాలి. హైప్ కోసం ప్రోమోలో ఇవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. 
 

78
Sridevi Drama company

ఇక సుడిగాలి సుధీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) నుండి వెళ్ళిపోయాక యాంకర్ గా రష్మీ ఎంట్రీ ఇచ్చింది. మల్లెమాల నిర్మిస్తున్న షోస్ లో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆదరణ దక్కుతున్నట్లు సమాచారం. మరోవైపు జబర్దస్త్ నెమ్మదించగా మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీపై ఫోకస్ పెట్టారు. హైపర్ ఆది, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ జబర్దస్త్ వీడాక టీఆర్పీ పడిపోయింది.

88
Sridevi Drama company

డీ, రొమాన్స్, డాన్స్, టాలెంట్స్ మొత్తం మిక్స్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ రూపొందించారు. మిగతా షోస్ తో పోల్చుకుంటే అంతకంతకూ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆదరణ దక్కించుకుంటూ పోతుంది.  ఇటీవల అనసూయ కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోయినా విషయం తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories