అఖిల్ కి హిట్ పడాలంటే అదొక్కటే మార్గం, జాతకంలో ఆ దోషం ఉంది.. వేణు స్వామి కామెంట్స్

Published : Apr 29, 2023, 02:38 PM ISTUpdated : Apr 29, 2023, 02:43 PM IST

అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్ నిన్న శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ ఫలితం మారలేదు.

PREV
16
అఖిల్ కి హిట్ పడాలంటే అదొక్కటే మార్గం, జాతకంలో ఆ దోషం ఉంది.. వేణు స్వామి కామెంట్స్

అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్ నిన్న శుక్రవారం రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ ఫలితం మారలేదు. అఖిల్ గత చిత్రాల తరహాలోనే ఏజెంట్ కూడా తీవ్రంగా నిరాశపరిచింది. తొలి షో నుంచి ఏజెంట్ చిత్రానికి మిక్స్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. 

26

భారీ హంగులతో, యాక్షన్ ఎపిసోడ్స్ తో హంగామా చేసినప్పటికీ సిల్వర్స్ స్క్రీన్ పై ఈ చిత్రం తేలిపోయింది. సరైన కథ, ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడంతో ఆర్డినరీ మూవీగా మిగిలిపోయింది. అఖిల్ ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించాడు. రిస్క్ చేసి అనేక యాక్షన్ స్టంట్స్ చేశాడు. ఏడాది పాటు సిక్స్ ప్యాక్ బాడీ మైంటైన్ చేశాడు. కానీ అఖిల్ శ్రమకి తగ్గ ఫలితం దక్కలేదు. 

36

అఖిల్ ఎంత కష్టపడుతున్నా విజయం వాయిదా పడుతూనే ఉంది. ఈ క్రమంలో అఖిల్ జాతకం తెరపైకి వచ్చింది. వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి మాట్లాడుతూ.. అఖిల్ జాతకంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నాగదోషం ఉందని వేణు స్వామి అన్నారు. 

46

ఆ దోషం ఉన్నప్పుడు ఇతరుల సలహాలు మిస్ ఫైర్ అవుతాయి అని వేణు స్వామి తెలిపారు. అఖిల్ హిట్ కొట్టాలంటే ఒక్కటే మార్గం ఉంది. అఖిల్ సినిమాల విషయంలో ఎవరి ప్రభావం ఉండకూడదు. అఖిల్ తన సొంత నిర్ణయాలతోనే సినిమాలు చేయాలి అని వేణు స్వామి సూచిస్తున్నారు. అఖిల్ జాతకంలో చంద్రుడు నీఛంలో ఉన్నాడు. తల్లి చంద్రుడికి.. తండ్రి సూర్యుడికి సంకేతం. 

56

చంద్రుడు నీఛంలో ఉన్నప్పుడు అమలగారి ప్రమేయం అఖిల్ కి ఏమాత్రం కలసిరాదు అని వేణూస్వామి తెలిపారు. ఇవన్నీ జాతకపరమైన అంశాలు మాత్రమే. వ్యక్తిగత అంశాలు ఏమాత్రం కాదు. అఖిల్ జాతకంలో ఇలానే ఉంది అని వేణు స్వామి బలంగా చెప్పారు. 

66

అఖిల్ తన తొలి చిత్రం తనపేరుతోనే చేశారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హలో అనే లవ్ స్టోరీ చేశారు. అది కూడా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను కూడా నిరాశపరిచింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఏజెంట్ చిత్రంతో అఖిల్ కి పెద్ద షాకే తగిలింది. 

click me!

Recommended Stories