ఇంతకి `సలార్‌ 2` ఉంటుందా?.. ప్రశాంత్‌ నీల్‌ వెనక్కి తగ్గుతాడా?.. తాజా ఫలితంతో క్లారిటీ వచ్చినట్టే..

First Published | Dec 22, 2023, 1:53 PM IST

ఇటీవల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. మొదటి భాగం హిట్‌ అయితేనే రెండో పార్ట్‌ తీస్తా అని ప్రకటించడంతో తాజా ఫలితంలో ఇక రెండో పార్ట్ ఉంటుందా లేదా అనే కొత్త సందేహం ప్రారంభమైంది. 

ప్రభాస్‌ హీరోగా నటించిన `సలార్‌` సినిమా నేడు శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంటుంది. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారిని ఆకట్టుకుంటుది. డార్లింగ్‌ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. `బాహుబలి` తర్వాత తాను ఎంజాయ్‌ చేసే సినిమా రాలేదని బాధపడిన వాళ్లకి `సలార్‌` ట్రీట్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ తోపాటు జనరల్‌ ఆడియెన్స్ సైతం ఖుషి అవుతున్నారు. మిగిలిన ఆడియెన్స్ కి ఇది పెద్దగా ఎక్కకపోయినా, పర్వాలేదనే టాక్‌ వస్తుంది. 

అయితే సినిమాపై దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌కి నమ్మకం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే `సలార్‌` సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన దర్శకుడు `సలార్‌ 2`పై అనుమానాలు వ్యక్తం చేశాడు. మొదటి పార్ట్ సినిమా సక్సెస్‌ అయితేనే రెండో పార్ట్ తీస్తానని తెలిపారు. దీంతో మొదటి భాగంపై ఆయనకు నమ్మకం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రశాంత్‌ నీల్‌ ఎందుకు టెన్షన్‌ పడుతున్నాడనేది సస్పెన్స్ గా మారింది. 


తాజాగా సినిమా విడుదలైంది. శుక్రవారం ఆడియెన్స్ ముందుకొచ్చింది. కొంత నెగటివిటీ ఉన్నా చాలా వరకు పాజిటివ్‌గానే వినిపిస్తుంది. కథ లేదనే పెదవి విరపు తప్ప, యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు అదిరిపోయాయి అంటున్నారు. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. యాక్షన్‌ సీన్లు, ఎలివేషన్లు, ఫ్రెండ్‌షిప్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. ప్రభాస్‌ని చాలా రోజుల తర్వాత సరిగ్గా దర్శకుడు వాడుకున్నాడు, ఏ రేంజ్‌లో ఆయన్ని చూపించాలో అలానే చూపించారు. ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో, అలానే చూపించడంతో అంతా హ్యాపీ అవుతున్నారు. ఇది కదా మాకు కావాల్సింది అంటున్నారు.

దీంతో ఇప్పుడు `సలార్‌` మొదటి పార్ట్ `సీజ్‌ పైర్‌` ఏం రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతుందనేది ఇప్పుడు అందరు వెయిట్‌ చేస్తున్నారు. తొలి రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు బ్రేక్‌ చేస్తుందనేది చూస్తున్నారు. అంచనాల మేరకు ఈ సినిమా ఇండియాలో `నాన్‌ బాహుబలి` రికార్డులన్నింటిని బ్రేక్‌ చేస్తుందని అంచనా వేస్తున్నారు. `బాహుబలి` టార్గెట్‌గా దూసుకుపోతుందని చెబుతున్నారు. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ సంచలనాలు సృష్టించిన `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌ 2`, `పఠాన్‌`, `జవాన్‌`లను దాటేస్తుందని ట్రేడ్‌ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఎంత మేరకు వెళ్తుందనేది వెయిట్‌ చేయాల్సింది. 

ఇదిలా ఉంటే ఇటీవల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. మొదటి భాగం హిట్‌ అయితేనే రెండో పార్ట్‌ తీస్తా అని ప్రకటించడంతో తాజా ఫలితంలో ఇక రెండో పార్ట్ కి లైన్‌ క్లీయర్‌ అయినట్టే అనే టాక్‌ వినిపిస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ ఇదే ఊపులో మరో పార్ట్ కూడా కంప్లీట్‌ చేస్తాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే రెండో పార్ట్ కి సంబంధించి చాలా వరకు షూటింగ్‌ వర్క్ కూడా కంప్లీట్‌ అయ్యిందని తెలుస్తుంది. సగానికిపైగా షూటింగ్‌ అయిపోయిందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మొదటి పార్ట్ లో ఆయన ట్విస్ట్ ఇచ్చి వదిలేయడంతో రెండో పార్ట్ కోసం ఆడియెన్స్ కూడా వెయిట్‌ చేస్తారు. దీంతో ఆ డిమాండ్‌ కూడా పెరుగుతుంది. దీంతో కచ్చితంగా రెండో పార్ట్ వస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

మొదటి పార్ట్ లోనే రెండో పార్ట్ కి సంబంధించిన టైటిల్‌ కూడా ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. `సలార్‌ః శౌర్యంగ పర్వం` అంటూ అనౌన్స్ చేశాడు. క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. ప్రభాస్‌ పాత్రలోని ట్విస్ట్ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంది. దీంతో ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు పృథ్వీరాజ్‌(దేవ) పాత్రతో ప్రభాస్‌కి గొడవేంటి? ఆయనకు ఖాన్సార్‌ ని అప్పగిస్తానని మాటిచ్చిన విషయం, దేవని రాజుగా చేయడం వంటి అంశాలు సెకండ్‌ పార్ట్ లో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్‌(దేవ అలియాస్‌ సలార్‌) హీరోనా, విలనా? అనేది కూడా రెండో పార్ట్ కి లీడ్‌ ఇచ్చాడు దర్శకుడు. దీని బట్టి అసలు కథ ఇక పార్ట్ 2లోనే ఉండబోతుందని తెలుస్తుంది. మొత్తానికి తాజా రిజల్ట్ ని బట్టి `సలార్‌` రెండో పార్ట్‌ `శౌర్యంగ పర్వం` ఉండబోతుందని చెప్పడంలో ఏమాత్రం డౌట్‌ లేదనే చెప్పొచ్చు. 

Latest Videos

click me!