
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఒకప్పుడు సినిమాల ఓపెనింగ్‌లకు పూజలు చేసేవారు. ఇప్పుడు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా మారిపోయారు. ఈ క్రమంలో ఆయన తన కెరీర్‌లో మొదటిసారి ఒక పనిచేశారు. ఒక మూవీకి గెస్ట్ గా రావడం. అది వేణు ఉడుగుల మూవీకి కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల సమర్పణలో తాజాగా `చంద్రయాన్` మూవీ రూపొందింది. వేణు ఉడుగుల అంతకు ముందు `రాజు వెడ్స్ రాంబాయి`కి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తన సమర్పణలోనే `చంద్రయాన్` మూవీ తెరకెక్కింది. ఇందులో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు.
`చంద్రయాన్` మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీనికి వేణు స్వామి గెస్ట్ గా రావడం విశేషం. సినిమా ఈవెంట్లకి గెస్ట్ గా రావడం ఆయనకిది ఫస్ట్ టైమ్ కావడం విశేషం. అది కూడా వేణు ఉడుగుల కోసం. ఇక చంద్రయాన్ గ్లింప్స్ బాగుంది. ఊర్లో కొందరు ఫ్రెండ్స్ కలిసి చంద్రయాన్ ప్రయోగం చేయాలనుకుంటారు. రాకెట్ తయారు చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు. మరి అది సక్సెస్ అయ్యిందా విఫలమయ్యిందా అనేది ఆసక్తికరం. టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది, ఫన్నీగా ఉంది. సినిమా కూడా ఇన్నోసెన్సీతో కూడిన కామెడీ ప్రధానంగా సాగుతుందని తెలుస్తోంది. వేణు ఉడుగుల సమర్పణలో వస్తోన్న మూవీ కావడంతో కచ్చితంగా ఇందులో మంచి కంటెంట్ ఉంటుందనే నమ్మకం ఏర్పడింది. ఇక ఈ నెల 30న ఆడియెన్స్ ముందుకు సినిమా రాబోతుంది.
ఈ క్రమంలో తాజాగా చంద్రయాన్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చిన వేణు స్వామి మాట్లాడుతూ, ఈ మధ్య చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ సినిమా టీమ్ లో ఉన్నారు. మనం ప్రతి రోజూ చంద్రుడు, సూర్యుడిని చూస్తుంటాం. వేణు ఉడుగుల ప్రొడ్యూసర్ గా మారితే చంద్రుడు, డైరెక్టర్ గా మారితే సూర్యుడు అనుకోవచ్చు. మా కాంబోలో త్వరలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. కృతిక నక్షత్రయుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది` అని తెలిపారు.
సమర్పకులు వేణు ఊడుగుల మాట్లాడుతూ, ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో పార్ట్ కావాలని అనిపించింది. ఈ టీమ్ నిజాయితీగా, ప్యాషన్ తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని నమ్మాను. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీట్ మెంట్ తో రూపొందించారు. వీళ్ల ప్రయత్నం అద్భుతంగా అనిపించింది. అమాయకులైన ఒక నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్ లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
సైన్స్ తెలియకుండా, పెద్దగా చదువుకోకుండా ఏదో సాధించాలనే తపనతో నలుగురు యువకులు రాకెట్ తయారుచేయడం, స్పేస్ లోకి వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. స్పేస్ లోకి వెళ్లేందుకు రాకెట్ తయారుచేసి స్పేస్ లోకి లాంఛ్ చేసే క్రమంలో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు. ఈ నెల 30న ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా` అని అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ - మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బందిపెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది మీరంతా సినిమాలో చూడబోతున్నారు` అని చెప్పారు. ఇందులో టీమ్ పాల్గొని తమ ఆనందాన్ని, సినిమా అనుభవాలను పంచుకున్నారు.