Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ 4వ వారం ఎలిమినేషన్‌.. గ్లామర్‌ బ్యూటీ ఔట్‌ ?

Published : Oct 03, 2026, 07:41 PM IST

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నాల్గో వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే లీక్‌ అయిన సమాచారం మేరకు గ్లామర్‌ బ్యూటీ హౌజ్‌ని వీడబోతున్నారని సమాచారం.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10లో ట్విస్ట్ లు, టర్న్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్ మొన్ననే ప్రారంభమైనట్టు అనిపించింది. కానీ అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంటుంది. 16 మంది కంటెస్టెంట్లతో ఈ సీజన్‌ బిగ్‌ బాస్‌ షో ప్రారంభమైంది. మొదటి వారంలో ఇద్దరు ఎలిమినేట్‌ అయ్యారు. మళ్లీ ఒక కంటెస్టెంట్ రీఎంట్రీ ఇచ్చారు. రెండో వారంలో కృష్ణుడు ఎలిమినేట్‌ అయ్యాడు. మూడో వారంలో మిథిలేష్‌, అపూర్వ హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ వచ్చిన మూడో రోజే 15 లక్షల సూట్‌ కేసు పట్టుకొని వెళ్లిపోయాడు మిథిలేష్‌. ఇది అందరిని ఆశ్చర్యపరిచింది.

24
నాల్గో వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే

ఇక ఇప్పుడు నాల్గో వారంలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో రోహిత నాయుడు, త్రిగుణ్‌, నరేష్‌, అమన్‌, ముఖేష్‌ గౌడ, దేబ్జానీ, చరణ్‌, షాలిని, శ్రష్టి నామినేషన్‌లో ఉన్నారు. ఇందులో చరణ్‌, షాలిని, శ్రష్టి ఓటింగ్‌లో చివర్లో ఉన్నారు. మరి వీరిలో నాల్గో వారం హౌజ్‌ని వీడేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి సంబంధించిన అప్‌ డేట్‌ వచ్చింది. లీక్‌ సమాచారం మేరకు ఈ వారం గ్లామర్‌ బ్యూటీ హౌజ్‌ని వీడబోతుందట.

34
శ్రష్టి ఎలిమినేట్‌ ?

బిగ్‌ బాస్‌ తెలుగు 10.. నాల్గో వారం డేంజర్‌ జోన్‌లో శ్రష్టి ఉన్నారు. ఆమె ఈ వారం ఎలిమినేట్‌ కాబోతుందట. ఇది ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. ఓటింగ్‌లో బాటమ్‌లో ఉన్న నేపథ్యంలో ఆమెని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం. అయితే ప్రారంభం నుంచి శ్రష్టి లీస్ట్ లోనే ఉంది. మొదటి వారమే హోస్ట్ నాగార్జున వార్నింగ్‌ ఇచ్చాడు. కృష్ణుడు, శ్రష్టిని ప్రత్యేకంగా పిలిచి మరీ హెచ్చరించారు. ఇదిలా ఉంటే హౌజ్‌ నుంచి పంపించేస్తామని తెలిపారు. మూడో వారంలో కొంత హడావుడి చేసింది శ్రష్టి. కానీ నాల్గో వారం మళ్లీ డీలా పడిందని తెలుస్తోంది. దీంతో ఆమెకి ఓటింగ్‌ తగ్గిందట. మిగిలిన కంటెస్టెంట్లు మంచి కంటెంట్‌ ఇవ్వడం, తమ వ్యక్తిగత ఫాలోయింగ్‌ ఉన్న నేపథ్యంలో వాళ్లు సేవ్‌ అయ్యారు. కానీ శ్రష్టి మాత్రం ఈ వారం బుక్కైపోయిందని, ఆమె ఎలిమినేట్‌ అయ్యిందని సమాచారం.

44
వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ప్లాన్‌

ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్‌ జరుగుతుందట. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా నాల్గో వారం గ్లామర్‌ బ్యూటీ హౌజ్‌ని వీడబోతుందని చెప్పొచ్చు. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్‌ బాస్‌ తెలుగు 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ ఉండబోతున్నాయట. మరో ముగ్గురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి రాబోతున్నారట. ఇది వచ్చే వారం ఉండబోతుందని సమాచారం. ఇక ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో త్రిగుణ్‌, దేబ్జానీ, ముఖేష్‌ గౌడ, రోహిత్‌ నాయుడు, అమన్‌, చరణ్‌, సింగర్‌ ఝాన్సీ, వర్షిణి సౌందరాజన్‌, షాలిని, అపూర్వ, జబర్దస్త్‌ నరేష్‌, రామ్‌ ప్రసాద్‌, టెంపర్‌ వంశీ, సుధీర్‌ రెడ్డి ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories