యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి చిత్ర ఫీవర్ ఇండియాని ఊపేస్తోంది. గురువారం రోజు భారీ అంచనాలతో విడుదలైన కల్కి 2898 AD చిత్రం మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ లో కళ్ళు చెదిరే విజువల్స్ తో నాగ్ అశ్విన్ థ్రిల్ చేశాడు. యాక్షన్ సీన్స్ అయితే హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తగ్గలేదు.