ప్రభాస్ నెక్స్ట్ మూవీ రాజమౌళితో, 10 ఏళ్ళ పాటు మహాభారతం.. హింట్ ఇచ్చిన జక్కన్న, ఇష్టం లేకుండా ఓకే చెప్పాడా ?

First Published Jun 27, 2024, 3:14 PM IST

నాగ్ అశ్విన్ కల్కి 2898 AD చిత్రంలో విజువల్ ఫీస్ట్ అందిస్తూనే.. గమ్మత్తైన క్యామియో రోల్స్ తో కూడా థ్రిల్ చేశాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD గురువారం రోజు జూన్ 27 నుంచి థియేటర్స్ లో సందడి మొదలు పెట్టింది. ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి చిత్రం థియేటర్స్ లోకి రావడమే కాదు.. విజువల్స్ ఫీస్ట్ ఇస్తోంది. 

అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ థ్రిల్ ఫీల్ అయ్యేలా, గూస్ బంప్స్ కలించేలా నాగ్ అశ్విన్ కొన్ని అద్భుతమైన సీన్లు రెడీ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ హాలీవుడ్ చిత్రాలకు తీసిపోని విధంగా ఉంది. నాగ్ అశ్విన్ ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ సరికొత్తగా ఉంటూ ఆడియన్స్ కి బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. టాక్ ఈ రేంజ్ లో ఉన్నప్పుడు తొలి రోజు నుంచే కల్కి వసూళ్ల ప్రభంజనం గ్యారెంటీ అంటూ ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో విజువల్ ఫీస్ట్ అందిస్తూనే.. గమ్మత్తైన క్యామియో రోల్స్ తో కూడా థ్రిల్ చేశాడు. జక్కన్న రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ లాంటి వాళ్ళు చిన్న గెస్ట్ రోల్స్ లో మెరిశారు. రాజమౌళి పోషించిన రోల్ అయితే భలే ఫన్నీగా ఉంది. 

సుమతి పాత్రలో నటిస్తున్న దీపికా పదుకొనెని పట్టుకుని కాంప్లెక్స్ లో అప్పగిస్తే అతడికి 5 మిలియన్ యూనిట్స్ డబ్బు వస్తుంది. తనకి అప్పగించిన టాస్క్ పూర్తి చేసేందుకు సుమతిని పట్టుకోవడానికి ప్రభాస్ బయలుదేరుతాడు. ఈ క్రమంలో రాజమౌళి ప్రభాస్ కి అడ్డు తగులుతాడు. ఎందుకంటే గతంలో ప్రభాస్.. రాజమౌళికి కొంత డబ్బు అప్పు ఉంటాడు. తన అప్పు తీర్చాలని జక్కన్న ప్రభాస్ వెంట పడతాడు. 

ఈ క్రమంలో ప్రభాస్ రాజమౌళి నుంచి తప్పించుకుని పారిపోతాడు. పారిపోయే సమయంలో ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. నా అప్పు తీర్చే  అని రాజమౌళి అంటే.. వామ్మో ఒక్కసారి దొరికినందుకే 5 ఏళ్ళు వదల్లేదు. ఇంకోసారి దొరికితే నా పని అయిపోతుంది అంటూ పారిపోతుంటాడు. దీనితో రాజమౌళి స్పందిస్తూ.. నువ్వు కనుక ఇంకోక్కసారి దొరికితే పదేళ్లు వదలను చూడు అని వార్నింగ్ ఇస్తాడు. ఈ డైలాగ్స్ థియేటర్స్ లో నవ్వులు పూయించాయి. 

బాహుబలి చిత్రం కోసం రాజమౌళి ఐదేళ్లు ప్రభాస్ ని వదల్లేదు. ఇదే విషయాన్ని డైలాగ్స్ లో చెప్పారు. ఇంకొకసారి దొరికితే 10 ఏళ్ళు వదలను అని అంటాడు. దాని అర్థం మహాభారతం చిత్రమే అని ఫ్యాన్స్ అంటున్నారు. మహాభారతం చేయాలంటే మినిమమ్ 10 ఏళ్ళు టైం కావాలి అని రాజమౌళి గతంలో చెప్పారు.

 అంటే ప్రభాస్ కనుక ఒకే చెబితే రాజమౌళి వీలైనంత త్వరలోనే మహాభారతం మొదలు పెడతారన్నమాట. కల్కి చిత్రంలో జక్కన్న ఇచ్చిన హింట్ అదే అని అంటున్నారు. పదేళ్లు ఒకే ప్రాజెక్టు పై ఉండాలంటే ఏ హీరోకి అయినా చుక్కలు కనిపిస్తాయి. మరి ప్రభాస్ కి ఇష్టం ఉందో లేదో.. కానీ జక్కన్న అడిగితే మాత్రం కాదనడు. 

Latest Videos

click me!