శోభా శెట్టి మ్యాడ్‌ విచ్చింగ్‌ అంటూ అమర్‌ దీప్‌ దారుణమైన కామెంట్‌?.. కోపంలో అతని ఫోటో చించేసిన బిగ్‌ బాస్‌ భామ

Published : Dec 11, 2023, 08:42 AM IST

అమర్ దీప్‌, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సీరియల్‌ బ్యాచ్‌గా పేరుతెచ్చుకున్నారు. కానీ తాజాగా శోభా పై అమర్‌ దీప్‌ చేసిన కామెంట్లు షాకింగ్‌గా మారాయి. 

PREV
16
శోభా శెట్టి మ్యాడ్‌ విచ్చింగ్‌ అంటూ అమర్‌ దీప్‌ దారుణమైన కామెంట్‌?.. కోపంలో అతని ఫోటో చించేసిన బిగ్‌ బాస్‌ భామ

బిగ్‌ బాస్‌ తెలుగు 7 14వ వారంలో బుల్లితెర మోహిని, నటి శోభా శెట్టి ఎలిమినేట్‌ అయ్యింది. ఊహించినట్టుగానే ఆమె ఈ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వీడింది. అయితే ఆమెని ఎప్పుడో ఇంటి నుంచి పంపాలనే కామెంట్లు తరచూ వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఆమె సర్వైవ్‌ అవ్వగలిగిందంటే గొప్ప విషయమనే చెప్పాలి. అయితే బిగ్‌ బాస్‌ నిర్వాహకులే ఆమెని కావాలనే ఉంచారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ఆల్మోస్ట్ సూపర్‌ 7గా ఆమె ఎలిమినేట్‌ కావడం విశేషమని చెప్పొచ్చు. 
 

26

ఆదివారం ఎపిసోడ్‌లో శోభా శెట్టి ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె స్టేజ్‌పై తన ప్రోమో చూసుకుని కన్నీరు మున్నీరయ్యింది. నిజంగా శోభా శెట్టి జర్నీ చాలా ఎమోషనల్‌గా ఉండటం విశేషం. ఆ తర్వాత హౌజ్‌ మేట్స్ గురించి పాజిటివ్‌గా చెప్పిన శోభా శెట్టి.. ఆ తర్వాత బిగ్‌ బాస్‌ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. గత బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ దీనికి హోస్ట్ గా ఉన్నారు. ఆమె బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ కంటెస్టెంట్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తాజాగా శోభా శెట్టిని కూడా అలానే చేసింది. కానీ కొన్ని షాకింగ్‌ విషయాలను వెల్లడించి హౌజ్‌ మేట్స్ నిజ స్వరూపాలను బయటపెట్టింది. 
 

36

రావడం రావడంతో ఎదురుదాడికి దిగింది గీతూ. హౌజ్‌లో మీకు టాప్‌ 7 స్థానం ఇచ్చారు. కానీ ఆ రోజు మీరు ఒప్పుకోలేదు. బట్‌ ఇప్పుడు ఏడో స్థానంలోనే ఎలిమినేట్‌ అయ్యారని గీతూ చెప్పగా `అని మీరనుకుంటే నేనేమీ చేయలేను` అని శోభా శెట్టి చెప్పింది. ఆ తర్వాత హౌజ్‌లో ఉన్నప్పుడు తేజ తేజ అంటూ కలవరించారని, కానీ తేజ వెళ్లిపోయాక ఒక్క రోజు కూడా ఆయన్ని తలచుకోలేదని ప్రశ్నించింది. దీనికి శోభా రియాక్ట్ అవుతూ తేజ కోసం బిగ్‌ బాస్‌ హౌజ్‌కి రాలేదని చెప్పడం అదిరిపోయింది. 
 

46

బడ్డీ టాస్క్ లో ప్రియాంక వల్లే ఓడిపోయానని అన్నారు మీరు? అని ప్రశ్నించగా, అసలు మా మధ్య ఆ డిస్కషనే రాలేదని శోభా శెట్టి చెప్పింది. దీనికి ప్రియాంక ఫీల్‌ అయ్యిందో లేదో మీకు చూపించనా అంటే బిగ్‌ బాస్‌ గేమ్‌ అయిపోయింది. ఇంకా మళ్లీ దాని గురించి అవసరం లేదని చెప్పింది. కానీ ఈ బజ్‌ అయిపోయిన తర్వాతే మీ జర్నీ అయిపోతుందని గీతూ రియాక్ట్ అయ్యింది.

56

ఆ తర్వాత అమర్‌ దీప్‌ ప్రస్తావన వచ్చింది. అమర్‌ని విన్నర్‌ అవ్వాలనుకుంటున్నారు కదా. అమర్‌ మీ గురించి ఏమనుకుంటున్నాడో ఓ వీడియో చూద్దామని, వీడియో చూపించింది గీతూ. ఇందులో ప్రియాంకతో అమర్‌ మాట్లాడుతూ, మ్యాడ్‌ విచ్చింగ్‌ అనే పదం వాడాడు. (అయితే అది బ్యాడ్‌ విచ్చింగా లేక మ్యాడ్ పిచ్చింగ్‌ గా అనేది క్లారిటీ లేదు). కానీ దీనికి శోభా శెట్టి రియాక్షన్‌ చూస్తుంటే మాత్రం కచ్చితంగా అది పెద్ద పదమే అని అర్థమవుతుంది.ఆ కోపంలోనే ఆమె అమర్‌ దీప్‌ ఫోటోని చించేసి పగలగొట్టడం విశేషం. 
 

66

శివాజీ ప్రస్తావన వచ్చింది. ఇందులో ఆయన ఫోటో చూపిస్తూ.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో నువ్వు సర్వైవ్‌ కావాలంటే..శివాజీసర్‌ ఆడుతున్న స్ట్రాటజీని ఫాలో అయితే నువ్వు విన్నర్‌ కావచ్చు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది శోభా. ఆ తర్వాత సేఫ్‌ గేమ్‌ అంటూ గీతూ కామెంట్‌ చేసింది. నేను దీన్ని అగ్రీ చేస్తున్నా, నేను సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నా అని, ఆ తర్వాత ఓ ప్రశ్నకి సమాధానం లేకపోతే తెలియదు, మర్చిపోయినా అనే సమాధానం వస్తుందని చెప్పగా, ఇది కట్‌ చేయండి అంటూ శోభా సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం. మొత్తంగా ఈ ప్రోమో వైరల్ అవుతుంది. మరి పూర్తి ఎపిసోడ్‌లో దీనిపై క్లారిటీ రానుంది. 

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories