'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కారణాలు.. 100 కోట్ల షేర్ ఎవరివల్ల వచ్చిందో తెలుసా

Published : Jan 22, 2025, 11:19 AM IST

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇతర చిత్ర పరిశ్రమలని కూడా ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రానికి ఈ రేంజ్ లో వసూళ్లు గతంలో ఎప్పుడూ రాలేదు. 

PREV
15
'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కారణాలు.. 100 కోట్ల షేర్ ఎవరివల్ల వచ్చిందో తెలుసా

విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇతర చిత్ర పరిశ్రమలని కూడా ఆశ్చర్యంలో ముంచేస్తోంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రానికి ఈ రేంజ్ లో వసూళ్లు గతంలో ఎప్పుడూ రాలేదు. నవ్వించడం లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంలో వెంకటేష్ ని మించినోళ్లు లేరు. వాస్తవమే.. కానీ ఈ రేంజ్ రచ్చ గతంలో కూడా వెంకటేష్ కి సాధ్యం కాలేదు. 

 

25

రెగ్యులర్ ఫార్ములాతో సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలకు కాలం చెల్లింది. ఒక ఐటెం సాంగ్, నాలుగు ఫైట్స్ ఇలా ఉంటే ఆడియన్స్ ఆదరించడం లేదు. దీనితో పెద్ద దర్శకులు, స్టార్ హీరోలు పాన్ ఇండియా చిత్రాలతో కొత్త కాన్సెప్ట్ వేటలో ఉన్నారు. కానీ కమర్షియల్ చిత్రాలకు కాలం చెల్లింది కానీ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ అంశాలకు అప్పటికీ డిమాండ్ ఉంటుంది అని సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరోసారి నిరూపించింది. 

 

35

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కంటే గొప్ప చిత్రాలు చాలా చేశారు.  కానీ వెంకీని 100 కోట్ల షేర్ క్లబ్ లో నిలబెట్టిన చిత్రం ఇదే. లేటు వయసులో వెంకీకి ఇది ఎలా సాధ్యం అయింది అని అంతా చర్చించుకుంటున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది టైమింగ్.. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడే సంగం హిట్ అయిపోయింది. రెండవ కారణం ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ మధ్య కాలంలో రాలేదు. 

 

45

పుష్ప 2 లాంటి పాన్ ఇండియా చిత్రాలు, లక్కీ భాస్కర్, క లాంటి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు వరుసగా వచ్చాయి. ఇంటిల్లిపాది వెళ్లి కడుపుబ్బా నవ్వుకునే చిత్రం ఒక్కటి కూడా రాలేదు. అది కూడా సంక్రాంతి వస్తున్నాం చిత్రానికి బాగా కలసి వచ్చింది. ఈ చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరడానికి మరికొన్ని అంశాలు కూడా దోహదపడ్డాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి వింటేజ్ వెంకటేష్ ని చూపించడం లో బాగా సక్సెస్ అయ్యారు. గతంలో మారుతి బాబు బంగారం చిత్రంతో ట్రై చేసారు కానీ వర్కౌట్ కాలేదు. 

 

55

ఈ చిత్రంలో వెంకటేష్ కామెడీ టైమింగ్ పాతరోజుల్లో వెంకీని గుర్తు చేసింది. అనిల్ రావిపూడి చేసిన ప్రమోషన్స్ ఈ చిత్రానికి కలసి వచ్చాయి. గోదారి గట్టు సాంగ్ అయితే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పాత్రలతో కూడా మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది. బుల్లి రాజు పాత్ర కూడా బాగా పేలింది.  మొత్తంగా ఈ చిత్రం 100 కోట్ల షేర్ రాబట్టింది అంటే అందుకు కారణం సంక్రాంతి సీజన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, వింటేజ్ వెంకీ, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి, బుల్లిరాజు, భీమ్స్ మ్యూజిక్ అని చెప్పొచ్చు 

 

click me!

Recommended Stories