అప్పుడు ఏడిస్తే ఆపరా బాబూ అన్నారు.. ఇప్పుడు మీరే ఏడుస్తారుః వెంకీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ధనుష్‌పై ప్రశంసలు

Published : Jul 17, 2021, 03:26 PM ISTUpdated : Jul 18, 2021, 05:55 PM IST

కెరీర్‌ ప్రారంభంలో తాను సినిమాల్లో ఏడిస్తే కామెంట్లు చేసేవాళ్లు, వారి కామెంట్లు చూస్తుంటే ఓహో ఇలా కూడా ఉంటుందా అనుకునే వాడిని కానీ కెమెరా ముందు ఏడిస్తే యాక్సెప్ట్ చేస్తారని అర్థమైంది. ఇప్పుడు కచ్చితంగా ఏడిపిస్తా అంటున్నారు విక్టరీ వెంకటేష్‌. 

PREV
17
అప్పుడు ఏడిస్తే ఆపరా బాబూ అన్నారు.. ఇప్పుడు మీరే ఏడుస్తారుః వెంకీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ధనుష్‌పై ప్రశంసలు
వెంకటేష్‌, ప్రియమణి కలిసి నటించిన చిత్రం `నారప్ప`. శ్రీకాంత్‌ అడ్దాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల (జులై) 20న ఓటీటీ(అమెజాన్‌)లో విడుదల కాబోతుంది. తమిళ బ్లాక్‌ బస్టర్‌ `అసురన్‌`కిది రీమేక్‌. విడుదల సందర్భంగా వెంకీ మీడియాతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

27
ఓటీటీ విడుదలపై స్పందిస్తూ, ఎప్పుడూ ఏది అనుకోలేమని, ఎందుకు ఓటీటీలో రిలీజ్‌ అనేది మన చేతుల్లో ఉండని, అది పరిస్థితులను బట్టి జరిగిపోతుందని వెల్లడించారు. ఈవిషయంలో తన అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఆ విషయంలో వారికి క్షమాపణలు చెప్పాల్సిందే. నా వర్క్ గురించి వారికి తెలుసు. అందుకు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని తెలిపారు.

37
ఈ సందర్భంగా ధనుష్‌పై ప్రశంసలు కురిపించారు. ధనుష్‌ `అసురన్‌`లో అద్భుతంగా నటించాడని, తానేంటో నిరూపించుకున్నారని, తనకొక ఛాలెంజ్‌ని ఇచ్చారని తెలిపారు. ఈ కథ, టేకింగ్‌ నచ్చి, ఇలాంటి సినిమాలు తన వద్దకు రావడంలేదు, అందుకే ఎంపిక చేసుకున్నా.

47
తన కెరీర్‌లోనే నారప్ప పాత్ర ఎప్పుడూ చేయలేదన్నారు వెంకీ. తనకిది చాలా టఫ్‌ రోల్‌ అని, ఎమోషనల్‌ సన్నివేశాల్లో చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఆయా సీన్లలోనే ఉండిపోయానని తెలిపారు. గెటప్‌తోపాటు యాక్షన్‌ సీన్స్ కూడా ఛాలెంజింగ్గా అనిపించాయని చెప్పారు.

57
తన కెరీర్‌ బిగినింగ్‌లో ఎమోషనల్‌ సీన్లలో తాను ఏడుస్తుంటే జనాలు కామెంట్లు చేసేవాళ్లట. అపండ్రా అంటూ సెటైర్లు వేసేవారని, ఆ ఏడుపేదో కెమెరా ముందు ఏడవమని అనేవారట. అలా కెమెరా ముందు ఏడ్వడం స్టార్ట్ చేశాకని వాటికి ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు వెంకీ. అంతేకాదు ఇప్పుడు `నారప్ప`లోనూ ఎమోషనల్‌ సీన్లు ఉన్నాయని కచ్చితంగా వాటికి ఏడుస్తారని తెలిపారు.

67
ఇప్పుడు ఓటీటీ డామినేషన్‌ పెరిగిందని, వాటికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి వచ్చిందన్నారు. అయితే థియేటర్లు ఓపెన్‌ అయితే మళ్లీ ఓటీటీ హవా తగ్గుతుందన్నారు. ఇటీవల కాలంలో డిఫరెంట్‌ కథలు వస్తున్నప్పటికీ తన వద్దకు రావడం లేదని, ఈ ఏజ్‌లో కథల ఎంపిక చాలా ఛాలెంజింగ్‌గానే ఉంటుందని, కొన్ని సమయాల్లో వరుసగా కథలొస్తుంటాయి. కొన్నిసార్లు ఖాళీగా ఉండాల్సి వస్తుందన్నారు. ఇది సర్వసాధారణమే అని చెప్పాడు వెంకటేష్‌.

77
`మా` వివాదంపై అడిగిన ప్రశ్నకి ఆచితూచి స్పందించారు. వివాదాలు కామన్‌ అని, అన్నీ జరుగుతుంటాయి, వాటిని ఎక్కువ చేసి చూడొద్దన్నారు. ఏదీ మన చేతుల్లో లేదని, ఏదైనా జరగొచ్చని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదన్నారు., త్వరలోనే అన్ని సెట్‌ అవుతాయని తెలిపారు. నెక్ట్స్‌ సినిమాలు కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నానని, తాను ఒకటి అనుకుంటే జరిగేది మరోటని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories