దత్తత తీసుకున్న కూతురు ఆత్మహత్య.. ఆ విషాద క్షణాలను పంచుకున్న సీనియర్‌ నటి అన్నపూర్ణ

Published : Jul 17, 2021, 02:38 PM IST

సీనియర్‌ నటి అన్నపూర్ణ అంటే అమ్మ, బామ్మ పాత్రలే గుర్తుకొస్తాయి. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగు తెరపై సందడి చేసిన అన్నపూర్ణ తాజాగా తన జీవితంలోని విషాద రోజులను పంచుకుంది. తనకూతురు ఆత్మహత్య విషయం పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. 

PREV
17
దత్తత తీసుకున్న కూతురు ఆత్మహత్య.. ఆ విషాద క్షణాలను పంచుకున్న సీనియర్‌ నటి అన్నపూర్ణ
అన్నపూర్ణ దాదాపు ఏడువందలకుపైగా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన నటి. ఇప్పటికీ బామ్మ పాత్రలతో సందడి చేస్తున్నారు. ఎమోషనల్‌, సెంటిమెంట్‌, కామెడీ, నెగటివిటీ ఇలా అన్ని రకాల పాత్రలతో తెలుగు సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేశారు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

27
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కన్నీటి రోజులను పంచుకుంది. అపురూపంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడం తన జీవితంలో పెద్ద విషాదంగా చెప్పింది. దాన్ని తలుచుకుని ఎమోషనల్‌ అయ్యారు అన్నపూర్ణ.

37
`ఓ అమ్మాయిని దత్తత తీసుకుని పెంచుకున్నాం. ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని తెలిసి షాక్‌ అయ్యా`మంటూ ఆనాటి రోజులను చెప్పుకొచ్చింది.

47
`నా కూతురు కీర్తిని సినిమాల్లోకి పంపించొద్దని అనుకున్నా. డాక్టర్‌ గానీ, ఇంజనీర్‌ వంటి పెద్ద చదువులు చదివిద్దామని కలలు కన్నా. కానీ ఆమెకు చదువు అబ్బలేదు. పదవ తరగతి అనంతరం మాకు తెలిసిన వాళ్లలో ఓ సంబంధం ఉంటే మాట్లాడాను. ఇద్దరికి నచ్చింది అన్న తర్వాతే పెళ్లి చేశాను.

57
ఒక ఏడాదికి ఆమెకు పాప పుట్టింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్‌ చేసి మీ కూతురు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లాం.

67
అసలు కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ తెలియదు. నా కూతురికి కోపం ఎక్కువ. పైగా మా ఇంట్లో చాలా గారాభంగా పెరిగింది. ఇంట్లో పనులు చేయడం రాదు. అత్తగారింట వాళ్లు ఏమైనా అన్నారా? లేక భార్యభర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా? అన్నది నాకు తెలియదు. ఆ విషయాల గురించి మా అమ్మాయి ఏనాడు నాకు చెప్పలేదు. క్షణికావేశంలో మరి అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఘోరం జరిగిపోయింది` అని చెప్పింది అన్నపూర్ణ.

77
ఇటీవల `జాంబిరెడ్డి`, `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రాల్లో నటించిన అన్నపూర్ణ ప్రస్తుతం `ఎఫ్‌3`లో నటిస్తుంది. `ఎఫ్‌2`లోనూ తనదైన స్టయిల్‌లో కామెడీ చేసి మెప్పించింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories