వెంకటేష్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సంచలన దర్శకుడు ప్లానింగ్‌?

Published : Jan 25, 2025, 06:51 PM IST

ఈ సంక్రాంతికి `సంక్రాంతికి వస్తున్నాం` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు వెంకటేష్‌. ఇప్పుడు ఆయన మొదటిసారి పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారట.   

PREV
15
వెంకటేష్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సంచలన దర్శకుడు ప్లానింగ్‌?

విక్టరీ వెంకటేష్‌ ఈ సంక్రాంతికి హిట్‌ కొట్టాడు. చాలా ఏళ్ల తర్వాత తన రేంజ్‌ హిట్‌ పడింది. ఓ రకంగా నాన్‌ పాన్‌ ఇండియా రికార్డులను బ్రేక్‌ చేసే పనిలో ఉన్నారు వెంకీ మామ. `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ సుమారు రూ. 250కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఈ వీకెండ్‌లో ఇది అన్ని నాన్‌ పాన్‌ ఇండియా రికార్డులను బ్రేక్‌ చేయబోతుందని తెలుస్తుంది. ఈ మూవీ సక్సెస్‌ వెంకటేష్‌ కెరీర్‌కి పెద్ద బూస్ట్ ని ఇవ్వబోతుందని చెప్పొచ్చు. 
 

25

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వెంకీ పాన్‌ ఇండియా సినిమాలు చేయలేదు. తెలుగుకే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఆయన మొదటిసారి పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నారట. తన కెరీర్‌లోనే మొదటి సారి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్ లో భాగం కాబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీన్ని ఓ సంచలన దర్శకుడు రూపొందించబోతున్నారు. మరి ఆ దర్శకుడు ఎవరో కాదు రామ్‌ గోపాల్‌ వర్మ. ఆ మూవీ `సిండికేట్‌`. 

35

రామ్‌ గోపాల్‌ వర్మ ఇటీవలే ఈ మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. `సత్య` విడుదలై ముప్పై ఏళ్ల సందర్భంగా ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ చేశారు. ఈ సినిమా చూసుకుని దీన్ని తానే తీశానా అని ఆశ్చర్యపోవడంతోపాటు ఎమోషనల్‌ అయ్యారు వర్మ. తాను ఎంత తప్పు చేశాడో రియలైజ్‌ అయ్యాడు. ఇకపై బెస్ట్ క్వాలిటీ సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే `సిండికేట్‌`ని ప్రకటించారు. ఈ మూవీలో భారీ కాస్టింగ్‌ని తీసుకోబోతున్నారట. బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా ప్లాన్‌ చేస్తున్నారట. 

45
photo credit- aha-unstoppable 4

ఇందులో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, అజయ్‌ దేవగన్‌, విజయ్‌ సేతుపతి, మోహన్‌ లాల్‌, జేడీ చక్రవర్తి వంటి వారు నటించబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు నాగార్జున పేరు కూడా వినిపిస్తుంది. తాజాగా మరో క్రేజీ నేమ్‌ బయటకు వచ్చింది. వెంకటేష్‌ కూడా ఇందులో నటించే అవకాశాలున్నాయనట. రామ్‌ గోపాల్‌ వర్మ వెంకీతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వెంకీ కూడా సుముఖంగానే ఉన్నారనే వార్త వినిపిస్తుంది. 
 

55

`అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే` అనే పాయింట్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు  ప్రకటించారు వర్మ. మరి ఏ స్థాయిలో తీస్తారు? మరి నిజంగానే ఇంతటి బిగ్‌ స్టార్స్ ఇందులో నటిస్తారా? అనేది సస్పెన్స్. అందరు ఒప్పుకుంటే మాత్రం ఇదొక క్రేజీ మూవీ కాబోతుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories