Veerasimhareddy First Review: అదిరిపోయే రేటింగ్ దక్కించుకున్న బాలయ్య మూవీ... వీరసింహారెడ్డిలో అదే హైలెట్ అట!

Published : Jan 09, 2023, 10:47 PM IST

బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ ఇది. ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు వీరసింహారెడ్డికి అదిరిపోయే రేటింగ్ ఇచ్చాడు. ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది.   

PREV
17
Veerasimhareddy First Review: అదిరిపోయే రేటింగ్ దక్కించుకున్న బాలయ్య మూవీ... వీరసింహారెడ్డిలో అదే హైలెట్ అట!
Veerasimhareddy

వీరసింహారెడ్డి చిత్రంపై మొదటి నుండి పాజిటివ్ బజ్ నడుస్తుంది. బాలయ్య లుక్, ప్రోమోలు సినిమా మీద హైప్ పెంచేశాయి. ఇక ట్రైలర్ చూశాక సంక్రాంతికి బాలయ్య బాక్సాఫీస్ బద్దలు చేయడం ఖాయమని ఫిక్స్ అయ్యారు. వారి అంచనాలకు బలం చేకూర్చేలా ఓవర్సీస్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు టాప్ రేటింగ్ ఇచ్చాడు.

27


ఉమర్ సంధు ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలన్నింటికీ వరస్ట్ రేటింగ్ ఇచ్చాడు. వీరసింహారెడ్డి చిత్రాన్ని మాత్రం అద్భుతం అంటూ పొగిడారు. ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడిగా ఉన్న ఉమర్ సంధు వీరసింహారెడ్డి చూశాను నాకు బాగా నచ్చేసిందంటూ ట్వీట్ చేశారు. 

37


ఉమర్ సంధు... బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రానికి ప్రధాన బలం. ఆయన యాక్షన్ సన్నివేశాలు, హైవోల్టేజ్ డైలాగ్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతమైన నటన కనబరిచారు. వీరసింహారెడ్డి చిత్రానికి నా రేటింగ్ 3.5/5 అంటూ ట్వీట్ చేశారు. ఆయన రేటింగ్ ప్రకారం సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. 
 

47
WaltairVeerayya, VeeraSimhaReddy

అదే సమయంలో ఉమర్ సంధు వాల్తేరు వీరయ్య చిత్రానికి బ్యాడ్ రేటింగ్ ఇవ్వడం కొసమెరుపు. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని ఆయన అవుట్ డేటెడ్ ఊర మాస్ చిత్రం అంటూ కొట్టిపారేశారు. వాల్తేరు వీరయ్య నచ్చలేదంటూ కొద్దిరోజుల క్రితం ఆయన ట్వీట్ చేశారు. 

57

వీరసింహారెడ్డికి మాత్రం ఉమర్ సంధు అల్టిమేట్ రేటింగ్ ఇచ్చాడు. బాలయ్య ఫ్యాన్స్ ఉమర్ సంధు రివ్యూకి ఫిదా అవుతున్నారు. కాలర్ ఎగరేస్తూ సంక్రాంతి విన్నర్ మేమే అంటున్నారు. 
 

67

2023 సంక్రాంతి పోటీ బాలయ్య-చిరంజీవి మధ్య నెలకొంది. వాల్తేరు వీరయ్య-వీరసింహారెడ్డి చిత్రాల ట్రైలర్స్ రెండు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో ఎవరు బిగ్గెస్ట్ హిట్ కొడతారనే ఆసక్తి కొనసాగుతుంది. 
 

77

వీరసింహారెడ్డి చిత్రాన్ని క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. వాల్తేరు వీరయ్యకు కే ఎస్ రవీంద్ర దర్శకుడు. జనవరి 12న వీరసింహారెడ్డి థియేటర్స్ లో దిగుతుండగా... వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల చేస్తున్నారు. రెండు చిత్రాల్లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
 

click me!

Recommended Stories