విబేధాల సంగతి అటుంచితే... మౌనికతో ఆయన వివాహం ఖాయమే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది . మంచు మనోజ్ తాజా ట్వీట్ తో దీనిపై మరింత స్పష్టత వచ్చింది. మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఆయన్ని మంచి తండ్రిగా,కొడుకుగా, భర్తగా.. అన్నింటికీ మించి గొప్ప మనసున్న వ్యక్తిగా మనోజ్ కొనియాడారు.