పూజకి వచ్చి పద్ధతిగా ఉండమన్నాను, నీ విలువ నువ్వు నిలుపుకోవడం లేదు, అసలు నువ్వు మనిషివేనా అంటూ చీదరించుకుంటుంది మాలిని. నీకు నువ్వే న్యాయం చేసుకోలేదు ఇంక నీ బిడ్డలకు ఏం న్యాయం చేస్తావు, ఇంక బయలుదేరు అనటంతో అవమానంగా ఫీలైన మాళవిక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు తల్లిని పట్టుకొని భయపడుతూ కూర్చుంటుంది ఖుషి. మాలిని వచ్చి భయపడ్డావా అని అడుగుతుంది. అదికాదు నానమ్మ ఎందుకు మాళవికమ్మ అలా చేస్తుంది మీరెవరూ ఎప్పుడూ నన్ను ఒక మాట కూడా అనలేదు, తను అలా కోప్పడే సరికి నాకు చాలా భయం వేసింది అంటుంది ఖుషి.