సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఏడాది లైగర్ చిత్రం విజయ్ దేవరకొండకి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పరాజయం నుంచి తేరుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు.
సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఏడాది లైగర్ చిత్రం విజయ్ దేవరకొండకి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పరాజయం నుంచి తేరుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
26
అదే విధంగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ ఒక క్రేజీ భారీ బడ్జెట్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా గౌతమ్ తిన్ననూరి మూవీ తెరకెక్కనుంది. కాగా నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
36
పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం అయింది. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ 4 సినిమాస్ సంస్థలు నిర్మించనున్నాయి. విజయ్ దేవరకొండ ట్రెడిషనల్ వేర్ లో హాజరయ్యారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.
46
శ్రీలీల కూడా ఎల్లో చుడిదార్ లో మెరుపులు మెరిపించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారికంగా ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్యన విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది.
56
'నేను ఎవరిని మోసం చేశానో చెప్పలేను ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు' అనే కొటేషన్ పోస్టర్ పై ఆసక్తికరంగా ఉంది. ఇదిలా ఉండగా గౌతమ్ తిన్ననూరి ముందుగా ఈ కథని మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో చేయాలనుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
66
కానీ కథపై పూర్తిగా కాన్ఫిడెన్స్ రాకపోవడంతో చరణ్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ కథ విజయ్ దేవరకొండ చేతుల్లోకి వెళ్ళింది. జెర్సీతో అద్భుతమైన స్టోరీ టెల్లర్ గా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి.. విజయ్ దేవరకొండ మూవీతో ఎలాంటి అద్భుతం చేస్తారో చూడాలి.