Ennenno Janmala Bandham: యష్ ని అలర్ట్ చేసిన రాజ్.. రంగంలోకి దిగిన వేద దంపతులు!

Published : May 22, 2023, 11:58 AM IST

Ennenno Janmala Bandham: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి మరో అమ్మాయిని లోపరుచుకోవాలని చూస్తున్న ఒక ప్రబుద్ధుని కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
18
Ennenno Janmala Bandham: యష్ ని అలర్ట్ చేసిన రాజ్.. రంగంలోకి దిగిన వేద దంపతులు!

 ఎపిసోడ్ ప్రారంభంలో కావ్య దంపతులని పేర్లు చెప్పి లోపలికి రమ్మంటుంది ఖుషి. తను చెప్పినట్లు చేసేయటమే లేకపోతే మిమ్మల్ని లోపలికి రానివ్వదు అని నవ్వుతారు వేద దంపతులు. పేర్లు చెప్పి లోపలికి వస్తారు రాజ్, కావ్య. నువ్వు మామూలు దానివి కాదు అంటూ ఖుషి ని ముద్దు చేస్తుంది కావ్య. వాళ్లని తన ఫ్యామిలీకి పరిచయం చేస్తారు యష్ దంపతులు.
 

28

కావ్య ని తీసుకొని చిత్ర గదికి వెళ్తుంది వేద. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా ఖుషి వచ్చి మా అన్నయ్యని పరిచయం చేస్తాను రా అక్క అంటూ కావ్యని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య ఎక్కడ లేకపోవడంతో తనని తీసుకొని వస్తాను ఇక్కడే ఉండు అంటూ కావ్యని వదిలేసి వెళుతుంది ఖుషి. ఒంటరిగా ఉన్న ఆమె కాళ్ళ దగ్గరికి ఒక పెళ్లి కార్డు ఎగిరి పడుతుంది.
 

38

దానిమీద చిత్ర వెడ్స్ అభిమన్యు అని రాసి ఉండటం చూసి అవాక్కవుతుంది కావ్య. వేదని పిలిచి విషయం చెప్తుంది. ఆ పక్కనే రూమ్ ఉండటంతో అభిని అనుమానిస్తుంది కావ్య. పొరపాటుగా జరిగితే పరవాలేదు కానీ అది అసలే డేంజర్ మనిషి జాగ్రత్త అని వేదని అలర్ట్ చేస్తుంది కావ్య. నేను చూసుకుంటాను అంటుంది వేద. మరోవైపు చిత్ర వసంత్ మాట్లాడుకుంటూ ఉంటారు.

48

ఇందులో ఎవరో వచ్చి వసంత్ ని పిలవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు వసంత్. అది అక్కడికి వచ్చి నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే నాతో పెళ్లి ఇష్టమే అన్నమాట అంటూ ఆమె మీద చేయి వేస్తాడు. చికాగ్గా చేతిని విదిలిస్తుంది చిత్ర. చెప్పింది గుర్తుంది కదా పెళ్లికి ఇంకా రెండు గంటలే టైం ఉంది బుద్ధిగా వచ్చి నాతో తాళి కట్టించుకో అట్నుంచి అంటే వెళ్ళిపోదాము లేదంటే తెలుసు కదా అంటూ ఆమె చేతిని పట్టుకుంటాడు అభి.
 

58

అప్పుడే వచ్చిన అభి వాళ్ళిద్దర్నీ అలా చూసి షాక్ అవుతాడు. ఏం జరిగింది అని చిత్రని అడుగుతాడు. తనకి కొత్త ప్రాజెక్టు వచ్చింది అందుకే కంగ్రాట్స్ చెప్తున్నాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అభి. వసంత్ కూడా చిత్రకి కంగ్రాట్స్ చెప్పి ఎమోషనల్ అవుతాడు. మరోవైపు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ చిత్రికి నాకు పెళ్లి జరగటం కన్ఫామ్ అంటాడు అభి. ఆ మాటలు అనుకోకుండా రాజ్ విని షాక్ అవుతాడు.
 

68

 రెండు జంటలని పీటల మీద కూర్చోబెట్టి పూజ ప్రారంభిస్తారు పంతులుగారు. అప్పుడు చిత్ర చాలా టెన్షన్ గా ఉండడం అటు వేద ఇటు రాజ్ ఇద్దరు గమనిస్తారు. పూజ పూర్తయిన తర్వాత కావ్య దంపతులు నాకు ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుందని తెలుసు అందుకే ఒక జంటకే గిఫ్ట్లు తీసుకొచ్చాము కానీ ఒక్కరికే ఇవ్వడానికి గిల్టీగా ఉంది అంటుంది కావ్య.

78

ఏమి పర్వాలేదు అక్కడ ఇస్తే ఇక్కడ ఇచ్చినట్లే అంటూ చిత్రని చూస్తూ మాట్లాడుతాడు అభి. అది కూడా రాజ్ గమనిస్తాడు. ఆ తర్వాత రాజ్  , యష్ ల దగ్గరికి వచ్చి చిత్రకి ప్రమోషన్ వచ్చింది ఇప్పుడే అభి ఎనౌన్స్ చేశాడు అంటాడు వసంత్. అంతలోనే అభి అక్కడికి వచ్చి తనకి పెళ్లి అవుతుంది కదా తన పొజిషన్ మారాలి కదా జస్ట్ లైక్ పార్ట్నర్ అంటాడు. అభి వసంత్ లు  పీటల మీద కూర్చోవడానికి వెళ్ళిపోతారు. యష్ ని పక్కకు తీసుకెళ్లి చిత్ర పడుతున్న టెన్షన్ గురించి చెప్తాడు రాజ్. ఇంతలో వేద పిలవడంతో అక్కడికి వెళ్తాడు యష్. పెళ్లి కార్డు సంగతి చెప్పి అభి మీద తన డౌట్ ని ఎక్స్ ప్రెస్ చేస్తుంది వేద. 

88

సరిగ్గా ఇదే విషయాన్ని రాజ్ కూడా నాకు ఇప్పుడే చెప్పాడు సంథింగ్ ఇస్ రాంగ్ అంటాడు యష్. ఇప్పుడే వెళ్లి అభిని నిలదీస్తాను అంటాడు. వద్దు మొత్తం ఫంక్షన్ అంతా స్పాయిల్  అయిపోతుంది. అభి ని అడిగితే మాత్రం నిజం చెప్తాడా? మీరు మామూలుగానే ఉండండి కానీ అభి ప్రవర్తనని అబ్జర్వ్ చేయండి. నేను చిత్ర దగ్గరికి వెళ్లి అసలు విషయం కనుక్కుంటాను అంటుంది వేద. తరువాయి భాగంలో మూడు ముళ్ళతో ఏకమవుతారు చిత్ర, వసంత్. అందరూ ఆనందంతో ఎంజాయ్ చేస్తారు.

click me!

Recommended Stories