ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. వసుధార టేబుల్ పై కూర్చొని రిషీ గురించి ఆలోచిస్తూ గులాబీ రేకులతో లవ్ షేప్ చేస్తుంది. ఆ సమయంలోనే రిషీ వస్తాడు.. ఆ టేబుల్ పై కూర్చోండి అని అంటే నాకు ఆ టేబులే కావాలి అని అంటాడు.. అప్పుడు వెంటనే టేబుల్ పై గులాబీ రేకులను తుడిపేస్తుంది. ఇక రిషీ అక్కడ కూర్చొని ఇవి ఏంటి అని అడుగుతాడు.. గులాబీ రేకులు సార్ అని చెప్తుంది.