Guppedantha Manasu: వసుధారపై సీరియస్ అయిన రిషి.. ఎంఎస్ఆర్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన వసు,జగతి?

Published : Apr 19, 2023, 07:42 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్  కొనసాగుతుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
17
Guppedantha Manasu: వసుధారపై సీరియస్ అయిన రిషి.. ఎంఎస్ఆర్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిన వసు,జగతి?

ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధార రేపు ఇంజనీర్ ని కాలేజీకి రమ్మని పిలిచాను రేపు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదిగో నేను ఇక్కడ కన్స్ట్రక్షన్ చేద్దామని అనుకుంటున్నాను నీకు ఓకేనా అనగా ఓకే సార్ అని అంటుంది. అప్పుడు వాళ్లిద్దరూ మెడికల్ కాలేజీ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో గాలి వచ్చి పేపర్లు అన్ని కిందకు పడిపోవడంతో వసుధర తీసుకోవడానికి వెళుతుంది. అనుకోకుండా వసుధార కింద పడిపోతుండగా వెంటనే రిషి పట్టుకుని నీకు అసలు బుద్ధుందా. పేపర్లు పడితే పడనివ్వు నీకు ఏమైనా అయితే అనగా మీరు ఉన్నారు కదా సార్ మేడం తో వసుధార ఇక్కడ నుంచి వెళ్ళిపో వసుధార అని సీరియస్ అవుతాడు రిషి.
 

27

ఏం మాట్లాడకుండా బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రిషి అనవసరంగా ఎక్కువగా కోపడ్డానా అనుకుంటూ వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కోప్పడ్డగా ఏం చేస్తాము ముందు వెనక చూసుకోవాలి కదా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కింద కూర్చోబెట్టి గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ చెప్పొచ్చు కదా సార్ అనుకుంటూ ఉంటుంది. సరేలే సార్ ఏం చేసినా కూడా నా కోసమే కదా చేసింది అనుకుంటూ బుంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది. తర్వాత రిషి వసుధర కోపం వచ్చిందా అని మెసేజ్ చేయగా వెంటనే వసుధార ఇప్పుడే చూసి రిప్లై ఇవ్వకూడదు సార్ నేను ఒక ఆట ఆడుకోవాలి అనుకుంటూ ఉంటుంది. 
 

37

అప్పుడు వసుధార మెసేజ్లు చూసి మౌనంగా ఉండగా రిషి మెసేజ్ ల మీద మెసేజ్లు చేస్తూ ఉంటాడు. ఆ మెసేజ్లు చూసి వసుధార మురిసిపోతూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం వసుధార ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. రిషి వచ్చి ఏంటి ఇంకా లేదు అనగా ఇంకా లేటవుతుంది సార్ కావాలంటే మీరు వెళ్లిపోండి అనడంతో నిజంగానే వెళ్ళిపోమంటున్నావా అనగా అవును సార్ అని అంటుంది. అప్పుడు రిషి థాంక్స్ అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు రిషి వెళ్లిపోయిన తర్వాత కనీసం ఒక్కసారైనా అడగొచ్చు కదా ఊపుకుంటూ వెళ్లిపోయారు అనుకుంటూ ఉంటుంది.
 

47

ఆ తర్వాత రిషి వెళ్లిపోవడంతో వసుధార రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు రిషి ఎదురుగా నిలబడిన కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి పిలవకపోగా వెంటనే వసుధార వెనక్కి వెళ్లి ఇదే బాగోలేదు సార్ వెళ్లాలి అనుకున్న వారు వెళ్లొచ్చు కదా మరి నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటూ వాగుతూ ఉంటుంది. అప్పుడు రిషితో ఫన్నీగా వాదిస్తూ ఉంటుంది. అప్పుడు వారిద్దరూ ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంజనీర్ కన్స్ట్రక్షన్ గురించి ఆ ప్లాన్ గురించి రిషికి వివరిస్తూ ఉంటాడు. ఇంతలో ఎమ్మెస్సార్ ఫోన్ చేసి నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనగా  నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్ నా బదులు వసుధార జగతి మేడం వస్తారు అనగా  మీరే రండి అనడంతో వాళ్లు నేను వేరు కాదు సార్ అంతా ఒకటే అని అంటాడు.
 

57

మీరు ఏదైతే చెప్పాలి అనుకున్నారో ఏ టు జెడ్ వాళ్లకు చెప్పేసేయండి అని అంటాడు రిషి. ఇంతలో మహేంద్ర రావడంతో ఇంజనీర్ గారు ప్లాన్ వివరిస్తున్నారు మనం వెళ్లి భూమి కొలతలు చూడాలి వసుధార జగతి మేడం దగ్గరికి వెళ్లాలి ప్రపోజల్ గురించి చెప్తాడు అంట అని అంటాడు రిషి. మరొకవైపు సౌజన్య రావు మరోసారి రిషి ని దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. మరొకవైపు వసుధార జగతి ఇద్దరు రిషి గురించి మాట్లాడుకుంటూ రిషి సార్ కల నెరవేరబోతోంది రిషి సార్ ఆనందపెట్టాలి అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. మరొకవైపు రిషి మహేంద్ర ఇద్దరూ వెళ్లి భూమి కొలతలకు సంబంధించినవి చూసుకుంటూ ఉంటారు.
 

67

అప్పుడు రిషి సౌజన్య రావు పెట్టిన ప్రపోజల్ గురించి మాట్లాడుతూ ఆయన చాలా నమ్మకస్తుడు చాలా నమ్మకంగా ఉన్నారు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుతూ ఉంటాడు రిషి. మరొకవైపు వసుధార జగతి సౌజన్య రావు దగ్గరికి వెళ్లగా అప్పుడు ఆ ప్రపోసల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు సౌజన్య రావు. అప్పుడు సౌజన్యలో తన అసలు రూపం బయటపెట్టి మీ కాలేజీ మా కాలేజీలో కలిపేయాలి అనగా జగతి అది కుదరదు అనడంతో మీరు ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోవడంతో పాటు రిషి ని కూడా ఒప్పించాలి అనగా జగతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
 

77

అయినా సరే ఒప్పుకోవాలి అనడంతో వసుధార జగతి అందుకు మాత్రం ఒప్పుకోరు. అప్పుడు వసుధార ఇదే మీ ప్రపోజల్ అయితే ఇంకొకసారి మాతో మాట్లాడకండి ఇంతటితో ఆపేస్తేనే మీకు మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం నేను డైరెక్ట్ గా రిషితో ఈ విషయం గురించి మాట్లాడతాను అనగా నా కొడుకు కాలేజీ ని ఊపిరిగా ఫీల్ అవుతున్నాడు మీ కల ఎప్పటికి నెరవేరదు అని అంటుంది జగతి.

click me!

Recommended Stories