Guppedantha Manasu: నీతోనే జీవితం అంటూ రిషీని పిడిస్తున్న సాక్షి.. జగతి, వసుని సాధించడానికి ఆయుధం దొరికిందంటూ!

Published : May 02, 2022, 07:57 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే రెండవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: నీతోనే జీవితం అంటూ రిషీని పిడిస్తున్న సాక్షి.. జగతి, వసుని సాధించడానికి ఆయుధం దొరికిందంటూ!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే సాక్షి (Sakshi) మాటలకు కోపం వ్యక్తం చేసిన రిషి (Rishi) వచ్చిన దారిలోనే వెళ్ళిపో సాక్షి అని అంటాడు. దాంతో సాక్షి నీతో జీవితం అని డిసైడ్ అయ్యాను అని అంటుంది. అంతేకాకుండా  నిన్ను మరచి పోదాం అని ప్రయత్నం చేశాను. కానీ ప్రతి క్షణం నువ్వు గుర్తొస్తూనే ఉన్నావని సాక్షి రిషి తో అంటుంది.
 

26

ఇక సాక్షి (Sakshi) మాటలు పట్టించుకోకుండా రిషి అక్కడ నుంచి వెళ్ళి పోతాడు. కానీ సాక్షి నేను నిన్ను మార్చుకుంటాను. మనిద్దరికీ ఇప్పటికే సగం పెళ్లి అయిపోయింది అని మనసులో అనుకుంటుంది. ఒకవైపు రిషి (Rishi) కారులో వసు అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
 

36

ఇక అదే క్రమంలో వసు (Vasu) తో జరిగిన తీపి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. మరోవైపు వసు ఒక కొత్త ఇంటికి వెళ్తుంది. ఆ తర్వాత వసు రిషి (Rishi) సార్ నా కోసం ఆరాట పడడానికి, ఆలోచించడానికి కారణం ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.
 

46

ఆ తర్వాత వసు (Vasu) పిల్లలకు ఫ్రీ ట్యూషన్ చెప్పాలి అని ఫిక్స్ అవుతుంది. అది తెలుసుకున్న బస్తీ పిల్లలు వసు కోసం ప్రేమగా రకరకాల స్వీట్లు తీసుకొని వస్తారు. మరోవైపు సాక్షి (Sakshi) కాలేజ్ కు రాగా అది ఏ మాత్రం నచ్చని రిషి తనను ఇండైరెక్టుగా అనేక మాటలతో బాధ పెడుతూ ఉంటాడు. 
 

56

ఇక రిషి (Rishi) వసు గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అటువైపుగా పోతున్న ఆటోలో వసు వెళుతూ ఉంటుంది. దాంతో రిషి ఆ ఆటోని ఫాలో అవుతాడు. ఇక ఇంటికి వెళ్ళిన వసు (Vasu) పిల్లలతో దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది దాంతో తెలియ కుండా రిషి ను పట్టుకుంటుంది. ఇక రిషి ఫోన్ ఆన్సర్ చేయనందుకు తనపై కోప్పడతాడు.
 

66

వసు తరువాయి భాగం లో అన్నిటికంటే శాశ్వతమైనది ప్రేమే కదా సార్ అని అంటుంది. ఇక రిషి (Rishi) వసుకు ఎదో చెప్పాలనుకొని చెప్పలేక పోతూ ఉంటాడు. ఆ తర్వాత రిషి తన ఇంట్లో హ్యాపీగా నడుచుకుంటూ వస్తూ అన్నిటికీ ఒకరోజు సమాధానం దొరుకుతుంది డాడీ అని మహేంద్ర (Mahendra) తో అంటాడు..

click me!

Recommended Stories