Lavanya Tripathi : మెగా కోడలి లేటెస్ట్ లుక్.. బ్లూ డ్రెస్ లో లావణ్య త్రిపాఠి కిర్రాక్ స్టిల్స్!

First Published | Feb 10, 2024, 7:08 PM IST

వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. అలాగే నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 
 

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి. కొన్ని చిత్రాల తర్వాత ప్రస్తుతం తెలుగు కుర్రాడినే పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయిపోయింది. 
 

మెగా కోడలిగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ Varun Tejతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి నవంబర్ 3న ఇటలీలో గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. 


పెళ్లి తర్వాత అటు వరుణ్ తేజ్, ఇటు వరుణ్ తేజ్ జంటగా ఆయా సందర్భాల్లో కనిపిస్తున్నారు. పలు టూర్లు, ఫ్యామిలీ ఫంక్షన్లలో సందడి చేస్తున్నారు. మరోవైపు తమ కెరీర్ లోనూ బిజీగా ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సరికొత్తగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. మఖ్యంగా ఆకట్టుకునేలా ఫొటోషూట్లు చేస్తూ నెట్టింట అదరగొడుతోంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. 

లేటెస్ట్ ట్రెండ్ ను తన ఫ్యాన్స్ కు పరిచయం చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. సరికొత్త అవుట్ ఫిట్లలో మెరియడంతో పాటు గ్లామర్ విందుతోనూ మైమరిపిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫొటోషూట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

బ్లూ లెహంగాలో, మ్యాచింగ్ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో లావణ్య త్రిపాఠి కిర్రాక్ ఫొటోషూట్ చేసింది. పైట లేకుండానే ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. అట్రాక్టివ్ స్టిల్స్ తో పాటు తన రూపసౌందర్యంతో కట్టిపడేసింది. ఇక చివరిగా లావణ్య ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

Latest Videos

click me!