లావణ్య త్రిపాఠినేనా.. పెళ్లి తర్వాత ఇలా అయ్యిందేంటబ్బా.! బాగా చూస్తే గానీ గుర్తుపట్టలేమే..

First Published | Nov 25, 2023, 6:22 PM IST

యూపీ బ్యూటీ, లావణ్య త్రిపాఠి మెగా కోడలిగా అత్తవారింట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. దీంతో  తన లుక్ కాస్తా ఆసక్తికరంగా మారింది. 

యంగ్ హీరోయిన్  లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూపీని వచ్చిన ఈ ముద్దుగ్మ తెలుగులో ఎన్నో సినిమాలు చేసి మెప్పించింది. తన పెర్ఫామెన్స్ తో, అందంతో కట్టిపడేసింది. 

ఇక ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)ను పెళ్లి కూడా చేసుకుని మెగా కోడలిగా ప్రమోషన్ పొందింది. వీరి పెళ్లి నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీ నగరంలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్ ఎన్ - కన్వేన్షన్ హాల్ లో జరిగింది. 


పెళ్లి తర్వాత అటు వరుణ్ తేజ్ ఇటు లావణ్య త్రిపాఠి వరుసగా  ఫొటోషూట్లు చేస్తున్నారు. నయా లుక్స్ లో  మెరుస్తున్నారు. వెడ్డింగ్ తర్వాత ఇద్దరు చేసిన ఫొటోషూట్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా లావణ్య మాత్రం షాకింగ్ లుక్ లో మెరిసింది. 
 

పెళ్లైన కొద్దిరోజులకే లావణ్య అందం మారిపోయినట్టుగా లేటెస్ట్ లుక్ ను చూస్తే అర్థమవుతోంది. హెవీ మేకప్ వల్లనో.. లేదంటే ఏదైనా ఫిల్టర్ వాడటం వల్లనో లావణ్ ను సడెన్ గా చూస్తే గుర్తుపట్టడం కష్టంగానే మారింది. ఇదే అభిప్రాయాన్ని నెటిజన్లూ వ్యక్తం చేస్తున్నారు. 

ఏదేమైనా లావణ్య స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. పింక్ లిప్స్, బ్లూ టైట్ ఫిట్ లో మైండ్ బ్లోయింగ్ గా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం వీడియోను మాత్రమే పంచుకుంది. తన బ్యూటీతో, కత్తిలాంటి చూపులతో మెస్మరైజ్ చేసింది. 

అయితే ఇప్పుడు లావణ్య ఇన్ స్టాలో ఎందుకు అడుగుపెట్టిందనే విషయానికొస్తే.. తనను పెళ్లి కూతురుగా బాగా ముస్తాబు చేసి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చింది. స్టైలింగ్ - అశ్విన్, హసన్ ఖాన్.. మేకప్ -సాండీ, హెయిర్ - హఫ్సా కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. సూపర్ అవుట్ ఫిట్స్ అందించిన మనీష్ మల్హోత్రాకు ధన్యవాదాలు తెలిపింది. 

Latest Videos

click me!