ఈ ఏడాది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూడు పాన్ ఇండియా చిత్రాల్లో నటించాల్సి ఉంది. రాజా సాబ్ చిత్రం పూర్తి కావస్తోంది. ఇక ప్రభాస్ ఫోకస్ పెట్టాల్సింది స్పిరిట్, ఫౌజి, కల్కి 2 చిత్రాలపైనే. ఈ మూడు చిత్రాల షూటింగ్స్ ఈ ఏడాది జరగనున్నాయి. ఆల్రెడీ ఫౌజి షూటింగ్ కొంత భాగం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూడు ప్రభాస్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి.