గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్, వరుణ్ తేజ్ కి మళ్ళీ!

Published : Aug 25, 2023, 06:21 AM IST

వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. నేడు గ్రాండ్ గా విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ట్విట్టర్ టాక్ ఏంటో చూద్దాం...   

PREV
18
గాండీవధారి అర్జున ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్, వరుణ్ తేజ్ కి మళ్ళీ!
Gandeevadhari Arjuna Review


వరుణ్ తేజ్- సాక్షి వైద్య జంటగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన చిత్రం గాండీవధారి అర్జున. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఆగస్టు 25న గ్రాండ్ గా విడుదలైంది. యూఎస్ ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. 

28
Gandeevadhari Arjuna Review

భిన్నమైన సబ్జెక్టులు ఎంచుకోవడంలో వరుణ్ తేజ్ ముందుంటారు. ఈ క్రమంలో ఆయనకు జయాపజయాలు కామనే. ఈసారి ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ వైపు మొగ్గు చూపారు. గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున మూవీ చేశారు. చెప్పాలంటే ఈ సినిమా మీద ఎలాంటి హైప్ ఏర్పడలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా స్టార్స్ ఎవరూ రాలేదు. దీంతో గాండీవధారి అర్జున సినిమా గురించి జనాల్లో పెద్దగా చర్చ జరిగింది లేదు. 
 

38
Gandeevadhari Arjuna Review

ఈ సినిమా కథ విషయానికి వస్తే అర్జున్ వర్మ(వరుణ్ తేజ్) ఒక బాడీ గార్డ్. హై ప్రొఫైల్ కలిగిన ఇండియన్ మినిస్టర్(నాజర్) కి ఓ గ్యాంగ్ నుండి ప్రమాదం ఉంటుంది. వారి నుండి మినిస్టర్ ని కాపాడడమే వరుణ్ బాధ్యత. మరి అర్జున్ వర్మ తన బాధ్యత ఎలా నెరవేర్చాడు. మినిస్టర్ ని ఎలా కాపాడాడు అన్నదే కథ.. 
 

48
Gandeevadhari Arjuna Review

యూఎస్ ప్రీమియర్స్ చూసిన క్రిటిక్స్, ఆడియన్స్ మూవీపై తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. మెజారిటీ ఆడియన్స్ సినిమా ఆశించిన స్థాయిలో లేదంటున్నారు. ఎలాంటి థ్రిల్స్, ట్విస్ట్స్ లేకుండా ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మినహాయిస్తే ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేవు.

58
Gandeevadhari Arjuna Review

యాక్షన్ సీక్వెన్స్లు కూడా అంతంత మాత్రమే. పెద్దగా థ్రిల్ చేయలేకపోయాయని అంటున్నారు. ముఖ్యంగా నెరేషన్ చాలా మెల్లగా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలతో తెరకెక్కించారని అభిప్రాయపడుతున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్స్ కి కావాల్సిన రేసీ స్క్రీన్ ప్లే మిస్ అయ్యిందన్న మాట వినిపిస్తోంది.

68
Gandeevadhari Arjuna Review

సెకండ్ హాఫ్ లో మూవీ పుంజుకుంటుందని చూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైందని తెలుస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, స్టైలిష్ మేకింగ్  మినహాయిస్తే గాండీవధారి అర్జున చిత్రంలో చెప్పుకోదగ్గ అంశాలేవీ లేవని ప్రేక్షకులు ట్వీట్ చేస్తున్నారు. ట్విట్టర్ టాక్ చూస్తే గాండీవధారి అర్జున యావరేజ్ మూవీ అన్నట్లుగా ఉంది. 
 

78
Gandeevadhari Arjuna Review


వరుణ్ తేజ్ ప్రెజెన్స్ కి పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి. హీరోయిన్ సాక్షి వైద్య, నాజర్ పాత్రలు కీలకంగా ఉన్నాయని అంటున్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించ లేకపోయారని ట్విట్టర్ టాక్. ఇక పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం ఏమిటో తెలియదు... 

88
Gandeevadhari Arjuna Review

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాసర్, విమలా రామన్, వినయ్ రాయ్, నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమటం
రచన & దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
సమర్పణ : బాపినీడు.బి బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నిర్మాత: BVSN ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి (యుకె)
ఆర్ట్ డైరెక్టర్ : శివ కామేష్ డి
 ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
సంగీతం: మిక్కీ జె మేయర్
 

click me!

Recommended Stories