Varun Tej - Sai Pallavi Movie : వరుణ్ తేజ్ - సాయిపల్లవి కాంబోలో సినిమా ఫిక్స్? ఎప్పుడు రాబోతుందంటే?

First Published | Feb 26, 2024, 9:20 PM IST

వరుణ్ తేజ్- సాయిపల్లవి(Sai Pallavi)  కాంబినేషన్ మరోసారి ఎప్పుడు రాబోతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై తాజాగా వరుణ్ తేజ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

మెగా పిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)   ‘ఆపరేషన్ వాలెంటైన్స్’ (Operation Valentine)  చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారత వైమానిక దళం నేపథ్యంలో... ఎయిర్ ఫోర్స్ నిర్వహించిన ఆపరేషన్ ఆధారంగా రూపుదిద్దుకుందీ చిత్రం. 
 

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ ఫుల్ బిజీగా ఉన్నారు. పలు ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలో సాయిపల్లవి (Actress Sai Pallavi)తో మరోసారి చేయబోయే సినిమాపై మాట్లాడారు. 


లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘ఫిదా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే సాయిపల్లవి ఇక్కడ హిట్ అందుకుంది. 

అలాగే లవ్ స్టోరీ జోనర్ లో వరుణ్ తేజ్ కు సక్సెస్ అందింది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ టాలీవుడ్ లో ప్రత్యేకంగా నిలిచింది. దీంతో మళ్లీ ఈ క్రేజీ కాంబో ఎప్పుడు రిపీట్అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుణ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. 

వరుణ్ మాట్లాడుతూ.. సాయిపల్లవితో మరోసినిమా చేయాలని ఉంది.. కచ్చితంగా చేస్తాం. సాయిపల్లవి కూడా తన ఆఫీస్ కు వచ్చే కథలను చెబుతూ ఉంటోంది.  కానీ మేం చేయబోయే కథ ‘ఫిదా’ కంటే కాస్తా ఎక్కువగా ఉండాలని చూస్తున్నాం.

అందుకే కాస్తా ఆలస్యం అవుతోంది. మంచి లవ్ స్టోరీ వస్తే మాత్రం కాంబినేషన్ రిపీట్ అవ్వుద్ది. నాకూ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ సినిమాలు చేయాలనుంది. నెక్ట్స్ వాటిపైనే ఫోకస్ పెడుతున్నాను.’ అని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆపరేషన్ వాలెంటైన్స్‘ మార్చి 1న విడుదల కాబోతోంది. 

Latest Videos

click me!