చిత్ర పరిశ్రమలో రాణించడం అంత సులభం కాదు. ఇక్కడ విజయాలే ఎవరి ఫేట్ అయినా నిర్ణయిస్తాయి. కొందరు హీరో ఆరంభంలో అద్భుతమైన విజయాలు సాధించి, స్టార్స్ అవుతారనే భావన కలిగించారు. అనూహ్యంగా ఫేడ్ అవుట్ అయ్యారు.
వారికి మంచి ఆరంభం లభించింది. స్టార్ హీరోలు అవుతారని ప్రేక్షకు భావించారు.ఊహించని విధంగా ఫేడ్ అవుట్ అయ్యారు. అలాంటి హీరోల్లో వరుణ్ సందేశ్ ఒకరు. హ్యాపీ డేస్ మూవీతో వరుణ్ ఇండస్ట్రీలో అడుపెట్టారు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీ డేస్ బ్లాక్ బస్టర్.
26
హ్యాపీ డేస్ అనంతరం కొత్త బంగారు లోకం చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ వరుణ్ సందేశ్ కి పడింది. దాంతో వరుణ్ తేజ్ కి యూత్ లో క్రేజ్ ఏర్పడింది. అయితే తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు. వరుస పరాజయాలతో ఫేమ్ కోల్పోయాడు. మైఖేల్ మూవీలో వరుణ్ నెగిటివ్ రోల్ చేశాడు.
36
హీరో, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ప్రేమ కావాలి చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ప్రేమ కావాలి సూపర్ హిట్ కొట్టింది. అనంతరం లవ్లీ మూవీతో మరో విజయం అందుకున్నాడు.
46
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఆది సాయి కుమార్ లవర్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ టెంపో మైంటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు కానీ విజయం దక్కడం లేదు. ఆది మార్కెట్ కోల్పోయాడు.
56
యూట్యూబర్ రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాలా మూవీతో హీరో అయ్యాడు. ఆ మూవీ సూపర్ హిట్. రెండో చిత్రం సినిమా చూపిస్త మావా సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. మూడో చిత్రం కుమారి 21 ఎఫ్ తో భారీ హిట్ కొట్టాడు.
66
కుమారి 21ఎఫ్ న్యూ ఏజ్ లవ్ డ్రామాగా తెరకెక్కింది. రాజ్ తరుణ్ కి ఫేమ్ తెచ్చిపెట్టింది ఈ చిత్రం. కుమారి 21 ఎఫ్ తర్వాత రాజ్ తరుణ్ కి మరలా బ్రేక్ రాలేదు. ఫేడ్ అవుట్ దశకు చేరిన రాజ్ తరుణ్... నా సామిరంగ చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేశాడు.