`పొన్నియిన్‌ సెల్వన్‌`లో మహేష్‌ బాబు, అనుష్క చేయాల్సి పాత్రలేంటో తెలుసా?.. అసలేం జరిగిందంటే?

First Published | Feb 27, 2024, 6:53 PM IST

మహేష్‌ బాబు, అనుష్క శెట్టి, విజయ్‌, కమల్‌ హాసన్‌, రేఖ ల పేర్లు `పొన్నియిన్‌ సెల్వన్‌` సినిమాకి వినిపించాయి. మరి ఎందుకు వాళ్లు నటించలేదు, మధ్యలో ఏం జరిగింది అనేది ఆసక్తికరం. 

ఇండియన్ సినిమాపై తమదైన ప్రభావం చూపించిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన చివరగా  `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రంతో వచ్చారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌, త్రిష, జయం రవి, కార్తి, శోభితా దూళిపాళ, శరత్‌ కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, జయరాం వంటి భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో డిజప్పాయింట్‌ చేసింది. కథ అర్థం కాకపోవడంతో ఆడియెన్స్ కి ఎక్కలేదు. ఇంకా సరళంగా మూవీని తెరకెక్కిస్తే బాగుండేది. 

అయితే ఈ సినిమాలో భారీ కాస్టింగ్‌ నటించిన విషయం తెలిసిందే. దర్శకుడు మణిరత్నం మొదట అనుకున్న కాస్టింగ్ వీళ్లు కాదు. ఆయన మనసులో ప్రారంభంలో వేరే ఆర్టిస్టులు ఉన్నారు. మెయిన్‌ కాస్టింగ్‌లో ఇతర స్టార్స్ ని అనుకున్నారు. కానీ వాళ్లు నో చెప్పడంతో సినిమాలో ఉన్న వాళ్లు వచ్చారు. మరి మణిరత్నం మొదట అనుకున్న స్టార్స్ ఎవరు? వాళ్లు ఎందుకు రిజెక్ట్ చేశారనేది చూస్తే.. 
 


మొదట ఈ సినిమాకి మహేష్‌ బాబు, విజయ్‌, అనుష్క శెట్టిలను అప్రోచ్‌ అయ్యారట మణిరత్నం. అరుణ్మోళి(పొన్నియిన్‌ సెల్వన్‌) పాత్రకి మహేష్‌ బాబుని అడిగారట. ఆయనతోపాటు విజయ్‌ని కార్తి నటించిన వల్లవరాయన్‌ పాత్రకి అడిగారట. కానీ ఈ ఇద్దరు రిజెక్ట్ చేశారు. డేట్స్, షూటింగ్‌ డిలే కారణంగా మహేష్‌ నో చెప్పినట్టు సమాచారం. విజయ్ పాత్ర నచ్చకనే నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. వారి పాత్రల్లో జయం రవి, కార్తిలు నటించారు. రచ్చ చేశారు. 
 

అనుష్క శెట్టిని కుందనవై పాత్రకి అడిగారట. అంతేకాదు నందిని పాత్రకి కూడా ఆలోచించారట. కానీ ఆమె నో చెప్పిందట. `బాహుబలి` తర్వాత వెంటనే రావడంతో తాను చేయలేనని తెలిపిందట. ఆ పాత్రలో త్రిషని ఎంపిక చేశారు. ఆమెకిది మరో స్థాయిని తీసుకెళ్లే పాత్ర. ఓ కొత్త పాత్రలో త్రిష జీవించింది. పాత్రకి ప్రాణం పోసింది. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా త్రిషకి మంచి పేరొచ్చింది. 
 

ఇక వీరితోపాటు మెయిన్‌ కాస్టింగ్‌ కూడా మణిరత్నం వేరే అనుకున్నారట. ఆదిత్య కరికాలన్‌ పాత్రకి కమల్‌ హాసన్‌ అనుకున్నారట. అలాగే నందిని పాత్రకి రేఖని అనుకున్నారట. ఈ ఇద్దరు చేసే సినిమా రేంజ్‌ పెరుగుతుందని నార్త్‌, సౌత్‌ లో ఇక తిరుగులేదని భావించారట. మొదట వీరితో చేయాలనుకున్నారట మణిరత్నం. కానీ ఈ ఇద్దరు నో చెప్పినట్టు సమాచారం. 
 

దీంతో విక్రమ్‌, ఐశ్వర్య రాయ్‌ లతో ఆ పాత్రలు చేశారు. సినిమాలో ఈ ఇద్దరి జీవించారు. విక్రమ్‌ పాత్ర ఎంతగా హైలైట్‌ అవుతుందో ఊహించుకోవచ్చు. ఆ పాత్ర మరణంతోనే సినిమా అయిపోయిందనే ఫీలింగ్‌ కలుగుతుంది. అంతగా అదరగొట్టాడు విక్రమ్‌. ఐశ్వర్య రాయ్‌ కూడా నందిని, మందాకిని దేవి పాత్రల్లో మెస్మరైజ్‌ చేసింది. కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌ని పండించింది. 

పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా ఆడలేదుగా కానీ అందులో నటించిన ఆర్టిస్టులందరికి మంచి పేరొచ్చింది. కెరీర్‌ బెస్ట్ యాక్టింగ్‌ పండించే అవకాశం దక్కింది. కానీ మణిరత్నం సినిమా స్క్రీన్‌ప్లే మరింత సింపుల్‌గా రాసుకుని, అంతే సింపుల్‌గా తెరకెక్కించి ఉంటే, కథని ఆడియెన్స్ కి ముందుగానే అలవాటు చేసి ఉంటే ఈ మూవీ అంతో ఇంతో బాగానే ఆడేది. కానీ చాలా వరకు అర్థం కాకపోవడం, కన్‌ఫ్యూజన్‌ కారణంగా సినిమా పెద్దగా ఆడలేకపోయింది. 
 

Latest Videos

click me!