గతంలోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా వర్షిణి టీవీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’,‘శ్రీ రామరక్ష’ వంటి చిత్రాల్లో నటించింది. చివరిగా ‘మళ్లీ మొదలైంది’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని ఆఫర్లు అందుకోవడం ఖాయమంటున్నారు.