Karthika Deepam: ఇదే చివరి రోజు అన్న డాక్టర్ బాబు.. ఏదో చెడు జరగబోతుందంటూ టెన్షన్ పడుతున్న సౌందర్య!

Navya G   | Asianet News
Published : Mar 07, 2022, 08:52 AM IST

Karthika Deepam: గత ఐదేళ్ళుగా బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ కార్తీకదీపం (Karthika Deepam). ప్రతిరోజు సరికొత్త ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది. అలాంటి ఈ సీరియల్ లో ఈరోజు మర్చి 7వ తేది ఎపిసోడ్ లో ఎం జరిగిందో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. 

PREV
19
Karthika Deepam: ఇదే చివరి రోజు అన్న డాక్టర్ బాబు.. ఏదో చెడు జరగబోతుందంటూ టెన్షన్ పడుతున్న సౌందర్య!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే పూజారి సౌందర్యకు "కార్తీక్, దీప" వాళ్ళను వెనక్కి తీసుకురమ్మని చెప్తాడు.. పూర్వజన్మ పాపాలు ఏమో కార్తీక్, దీప మళ్ళీ విడిపోయ్యే అవకాశం ఉందని చెప్పి సౌందర్యం గుండెల్లో అలజడి సృష్టిస్తాడు..
 

29

ఇక సీన్ కట్ చేస్తే.. మోనిత తుపాకీ పట్టుకొని ఆమె కార్తీక్ ఉన్న ఫోటోను సైకోలా చూస్తుంటుంది. ఇక అక్కడ ఉన్న పనిమనిషి అమ్మ ఎందుకు గన్ పట్టుకున్నారు అని అంటే కాఫీ తీసుకురా అంటుంది. దేవుడు ఉన్నాడు అమ్మ మీరు అలా టెన్షన్ పడకండి అంటుంది. దేవుడు అనేవాడు లేడు ఉంటే ఇలా చెయ్యడు అంటూ మోనిత వాపోతుంది.
 

39

ఇక ఈ సీన్ కట్ చేస్తే.. కార్తీక్, దీప పిల్లలతో కలిసి అప్పట్లో వారిద్దరూ హనీమూన్ వెళ్లిన ప్లేస్ చూసి అన్నీ గుర్తు చేసుకుంటారు.. పిల్లలు ఇద్దరు సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు.. కానీ దీప మాత్రం అప్పట్లో విడిపోవడానికి కారణమైనవి అన్నీ గుర్తు చేసుకుంటూ జీవితం ఎంత విచిత్రమైనది అని అంటుంది.. ఇక్కడ వెన్నెల రాత్రులు, అమావాస్య చీకట్లు అంటూ విహారిని గుర్తు చేసుకుంటుంది.
 

49

పిల్లలను చూస్తూ కార్తీక్ ఆనంద పడుతుండగా విహారితో ఆమె చెప్పిన కవిత్వలను గుర్తుచేసుకుంటుంది. ఇక కార్తీక్ ఆమెను పిలిచి సారీ దీప చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అంటాడు. నాకు నువ్వు రత్నల్లాంటి పిల్లలను ఇచ్చావ్ కానీ ఎందుకు అలా ఆలోచించానో అంటూ బాధపడుతాడు. అప్పుడు దీప అలా అనకండి డాక్టర్ బాబు అంటూ కన్నీళ్లు పెడుతుంది.
 

59

ఒకవైపు ఆనందం, మరోవైపు కన్నీళ్లు అంటూ దీప వాపోతుంది. అప్పుడు డాక్టర్ బాబు నిన్ను అనుమానించి నీకు పదకొండేళ్లు దురామాయ్యను అంటూ బాధపడుతాడు. అప్పుడు మీ తప్పు లేదు మోనిత చెయ్యాల్సిన తప్పు అంత చేసేసింది అంటూ చెప్తుండగా.. పిల్లలు అది విని మోనిత ఆంటీ మంచిదే కదా అని అడుగుతారు.
 

69

దీంతో దీప మాట్లాడుతూ.. ఎవరు చెడ్డవారు కాదు పరిస్థితులు అలా చేస్తాయి అని చెప్తుంది.. అప్పుడు డాక్టర్ బాబు అవును రా.. మనం ఇక్కడకు వచ్చింది ఎంజాయ్ చెయ్యడానికి.. బాగా తిందాం.. ఎంజాయ్ చేద్దాం అంటే.. కార్ డ్రైవింగ్ నాకు వచ్చేస్తుంది కదా అంటారు..
 

79

ఇక మరో సీన్ లో.. సౌందర్య మాట్లాడుతూ పూజారి సీన్స్ లో ఆపశకణం వినిపిస్తుంది అనగా ఆనంద్ రావు నాకు అలానే అనిపిస్తుంది అంటాడు. ఇక అక్కడ ఉన్న ఆదిత్య మాట్లాడుతూ అలా ఫీల్ అవ్వకు మమ్మి.. పూజారి జాగ్రత్తగా ఉండమన్నారు అంతే అన్నప్పటికి సౌందర్య అలానే మాట్లాడుతుంది.
 

89

ఇక మరో సీన్ లో డాక్టర్ బాబు కుటుంబంతో హోటల్ లో దిగుతాడు. పిల్లలు ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు గట్టిగా పిలుస్తూ ఎంజాయ్ చేస్తారు.. అప్పట్లో డాక్టర్ బాబు, వంటలక్క చేసిన చిలిపి పనులు గుర్తుచేసుకుంటూ నవ్వుకుంటారు.. ప్లేస్ ఎలా ఉందంటూ డాక్టర్ బాబు పిల్లలని అడగ్గా సూపర్ అంటారు..
 

99

డాక్టర్ బాబు, వంటలక్క ప్రకృతిని ఆస్వాదిస్తూ రొమాన్స్ సీన్స్ పెడుతారు.. ఇక ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక తర్వాత ఎపిసోడ్ లో కూడా ఈరోజు ఆఖరి రోజైన పర్లేదు అని అంటాడు అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరీ తరువాయి భాగంలో ఎలాంటి ట్విస్ట్ చూటుచేసుకుంటుందో చూడాలి..

click me!

Recommended Stories