Vanitha vijaykumar
తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయం. స్నేహం కోసం, సాంబ, ప్రతిరోజు పండగే, సరైనోడు, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పాత్రలకు ఆయన చక్కగా సరిపోతారు. ఆయన రెండవ భార్య మంజుల కూడా నటిగా రాణించారు.
ఎంత హెచ్చరించినా వినలేదు. కానీ ఒకసారి మద్యం సేవించడం వల్ల కామెర్లు బాగా ఎక్కువయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళితే వైద్యులు 72 గంటల్లో చనిపోతారని తెలిపారు. ఆ సమయంలో కూడా అమ్మ మా గురించే ఆలోచించింది. తాను లేకపోతే మీకు దక్కాల్సిన ఆస్తి దక్కదు అని చెప్పింది.
ఆసుపత్రి బెడ్ పై ఉంటూనే ఢిల్లీలోని ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీకి ఫోన్ చేసింది. తన పిల్లలకి రావాల్సిన ఆస్తిని వారి పేరుపై మార్చాలి. డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలి అని కోరింది. అలాగే వాంగ్మూలంగా వీడియో కూడా తీయాలి అని చెప్పింది. కానీ ఈ సమయంలో కరెక్ట్ కాదు అని వద్దని చెప్పా. అప్పుడు నాన్న వనిత బాగోగులు నేను చూసుకుంటాను. ఆమెకి అన్యాయం జరగనివ్వను అని చేయి పట్టుకుని చెప్పాడు.
vanitha vijayakumar
అప్పుడు అమ్మ నమ్మింది. నేను కూడా నమ్మాను. అమ్మ మరణించిన తర్వాత అంతా తలక్రిందులుగా మారిపోయింది. అంత్యక్రియలకు కూడా నాన్న మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. అప్పుడు శరత్ కుమార్, రాధా రవి గారు మమ్మల్ని పిలిచి అంత్యక్రియలు చేయించారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆస్తిలో నాకు హక్కు లేదని అంటున్నారు. ఆస్తి పంచితే అది నాకు కూడా చెందుతుంది అని వనిత వాదిస్తోంది.