పవన్‌ ఇచ్చిన షాక్‌కి ఫ్యాన్స్ కి మైండ్‌ బ్లాక్‌.. బన్నీ, మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ల ముందు తేలిపోయాడుగా..

First Published Jul 31, 2021, 3:07 PM IST

పవర్‌ స్టార్‌ అంటే అభిమానుల్లో ఓ పూనకం. థియేటర్లో ఆయన సినిమా వచ్చిందంటే ఆ రచ్చ, హంగామా మామూలుగా ఉండదు. కానీ అక్కడ మాత్రం బన్నీ, మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ ల ముందు తేలిపోయాడు. 
 

పవన్‌ కళ్యాణ్‌ అభిమానం, పిచ్చి, రచ్చ హంగామా అంటే అది కేవలం థియేటర్లలోనే, ఫస్ట్ డే కలెక్షన్లలోనే అని తెలిసిపోయింది. టీవీలో ఆయన పవర్‌ పనిచేయదని తాజాగా నిరూపితమైంది. ఆయన సినిమా ఇతర స్టార్ల సినిమాలతో పోల్చితే వెనకబడిపోయింది. దీంతో ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది.
undefined
పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీ ఇస్తూ నటించిన `వకీల్‌సాబ్‌` ఏప్రిల్‌9న థియేటర్లలో విడుదలై ఘన విజయంసాధించింది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ సినిమా వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. పవర్‌స్టార్‌ స్టామినా ఏంటో చూపించిందీ చిత్రం. మంచి సందేశం కూడా ఉండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళలకి కూడా బాగా కనెక్ట్ అయ్యింది.
undefined
అయితే ఇటీవల ఈ సినిమా టీవీలో విడుదలైంది. గతంలో ఉన్న టీఆర్‌పీ రేటింగ్‌ అన్నింటిని ఈ సినిమా బ్రేక్‌ చేస్తుందని అంతా భావించారు. కానీ ఊరించి ఉసూరమనిపించింది. ఈ సినిమాకి టీవీ రేటింగ్‌ కేవలం 19.12టీఆర్‌పీ రేటింగ్‌ వచ్చింది. అంతే తెలుగు సినిమాల్లో టీవీ రేటింగ్‌ విషయంలో ఇది టాప్‌ టెన్‌లోనూ లేకపోవడం పవన్‌ అభిమానులను తీవ్ర నిరాశకి గురిచేస్తుంది.
undefined
ఈ సినిమా కంటే ముందు వరుసలో అంటే బన్నీ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం 29.4రేటింగ్‌తో టాప్‌ 1లో ఉంది. ఆ తర్వాత 23.4 రేటింగ్‌తో మహేష్‌ `సరిలేరునీకెవ్వరు` ఉంది. మూడో స్థానంలో ప్రభాస్‌ `బాహుబలి 2` ఉంది. ఇది 22.7 రేటింగ్‌ని పొందింది. 22.54 రేటింగ్‌తో మహేష్‌ `శ్రీమంతుడు` నాల్గో స్థానంలో, 21.7 టీఆర్‌పీ రేటింగ్‌తో బన్నీ `డీజే` ఐదో స్థానంలో నిలవగా, 21.54 రేటింగ్‌తో `బాహుబలి` మొదటి భాగం ఆరో స్థానాన్ని దక్కించుకుంది.
undefined
వరుణ్‌ తేజ్‌ `ఫిదా` 21.31 రేటింగ్‌తో ఏడో స్థానంలో, విజయ్‌ దేవరకొండ `గీతగోవిందం` 20.8 రేటింగ్‌తో ఎనిమిదో స్థానాన్ని పొందింది. ఎన్టీఆర్‌ `జనతా గ్యారేజ్‌` 20.69తో తొమ్మిదో స్థానం, కీర్తిసురేష్‌ `మహానటి` 20.21 రేటింగ్‌తో పదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పవన్‌ `వకీల్‌సాబ్‌` ఉండటం గమనార్హం. దీంతో పవన్‌ మానియా థియేటర్లోనే కానీ, టీవీలో పనిచేయదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
undefined
దీనికి కారణాలు వెతికితే ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. మిగిలిన హీరోల సినిమాలు థియేటర్ లో విడుదలై ఆ తర్వాత డైరెక్ట్ గా టీవీలో వచ్చాయి. కానీ పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` మాత్రం థియేటర్లో విడుదలైన 20 రోజులకే ఓటీటీలో విడుదలైంది. ఇది అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ అయ్యింది. దీంతో టీవీ ఆడియెన్స్ లో చాలా మంది అప్పటికే ఓటీటీలో చూసేశారు. ఆ ప్రభావం టీవీపై పడిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. లేకపోతే రికార్డ్ రేటింగ్‌ సాధించేదని అభిప్రాయపడుతున్నారు.
undefined
థియేటర్లో విడుదలవడం, ఆ తర్వాత ఓటీటీ వచ్చాక కూడా అక్కడ భారీ ఆదరణ లభించడం, ఆ తర్వాత టీవీలోనూ బెటర్‌గానే రేటింగ్‌ రావడం గొప్పవిషయమంటున్నారు. ఏదేమైనా పవన్‌ పాత రికార్డ్ లను బ్రేక్‌ చేయలేకపోయారనే అసంతృప్తి మాత్రం ఆయన అభిమానులను వెంటాడుతుందట.
undefined
పవన్‌ ప్రస్తుతం `హరిహరవీరమల్లు`తోపాటు `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ రీమేక్‌ షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇటీవల విడుదల చేసిన మేకింగ్‌గ్లింప్స్ ఆకట్టుకుంది. భీమ్లా నాయక్‌గా ఆయన పోలీస్‌ లుక్‌లో అదరగొడుతున్నారు. మరోవైపు ఇందులో ఆయన సరసన నిత్యా మీనన్‌ హీరోయిన్‌గా ఎంపికైంది.
undefined
click me!